Consumer Court states dual pricing in multiplexes illegal మల్టీఫెక్స్ లకు భారీ జరిమానా..

Consumer court states dual pricing in multiplexes illegal

Vijayawada, consumer court, multiplexes, consumer forum president R Madhava Rao, Andhra Pradesh

The Vijayawada Consumer Forum came down heavily on the multiplexes for selling the food and beverages at exorbitant prices and imposed heavy fine for violating the laws.

మల్టీఫెక్స్ లకు భారీ జరిమానా..

Posted: 08/09/2018 07:48 PM IST
Consumer court states dual pricing in multiplexes illegal

ఎట్టకేలకు వినియోగదారుల న్యాయస్థానం మెల్కొంది. ఇన్నాళ్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా, చూసి చూడనట్టు వ్యవహరించిన కస్టమర్స్ ఫోరం, ఎట్టకేలకు వినియోగదారుల పక్షాన నిలిచింది. అధిక రేట్లతో వినియోగదారులను దోచుకుంటున్న మల్టీఫ్లెక్స్ థియేటర్ యజమానులకు షాక్ ఇస్తూ, భారీ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. మల్టీఫ్లెక్స్ థియేటర్లలోకి కానీ, సాధారణం థియేటర్లలోకి గానీ బయటి నుంచి తీసుకొచ్చే తినుబండారాలను లోపలికి అనుమతించరు. అయితే దీన్ని నేరంగా పరిగణిస్తూ వినియోగదారుల న్యాయస్థానం చట్టం తీసుకొచ్చింది.

వినోదం కోసం వచ్చిన వారిని, అధిక రేట్లతో దోచుకుంటున్న థియేటర్ల యజమానులకు షాక్ ఇస్తూ విజయవాడలోని ఐదు మల్టీఫ్లెక్స్ థియేటర్ల యాజమాన్యానికి 25 లక్షల రూపాయల భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా వినియోగదారులు బయట నుంచి తెచ్చుకునే తినుబండారాలనూ, మంచి నీటిని లోపలికి అనుమతించాలంటూ తీర్పు ఇచ్చింది. తమ ఆదేశాలు తక్షణం అమలయ్యేలా చూడాలంటూ తూనికలు, కొలతల శాఖను ఆదేశించింది.

విజయవాడలోని కొన్ని మల్టీఫ్లెక్స్ థియేటర్లు టికెట్ల విషయంలో దోచుకోవడమే కాకుండా ఆహార పదార్థాలను అధిక ధరలకు విక్రయిస్తూ, కస్టమర్లను దోచుకుంటున్నారంటూ కొందరు వినియోగదారులు, మార్గదర్శక సమితి సహకారంతో గత ఏడాది ఏప్రిల్‌లో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. ఎల్ఈపీఎల్‌, ట్రెండ్ సెట్‌, పీవీఆర్‌, పీవీపీ, ఐమ్యాక్స్ మల్టీఫ్లెక్స్‌ థియేటర్లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై సమగ్ర విచారణ జరిపిన కంస్యూమర్స్ కోర్టు న్యాయమూర్తి మాధవరావు సంచలన తీర్పు వెలువరించారు.

నగరంలోని ఐదు థియేటర్ల యాజమాన్యాలు, తినుబండారాలపై గరిష్ట చిల్లర ధర కంటే మూడురెట్లు అధికంగా ధర ముద్రించి వినియోగదారులను మోసం చేస్తున్నాయని తేలడంతో వినియోగదారులు నష్టపోయిన మొత్తాన్ని 9శాతం వడ్డీతో కలిపి పరిహారం చెల్లించాలని ఆదేశించారు. ఒక్కక్కరికి రూ. 5లక్షల చొప్పున మొత్తం రూ. 25లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని రెండు నెలల లోపు జిల్లా వినియోగదారుల ఫోరంలో జమ చేయాలని ఆదేశించారు.

థియేటర్లకు వచ్చే వినియోగదారులకు ఉచిత తాగునీరు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, బయట నుంచి తీసుకొచ్చే ఆహార పదార్థాలు, శీతల పానీయాలను అనుమతించాలంటూ థియేటర్ల యజమానులను ఆదేశించారు. వినియోగ‌దారుల న్యాయస్థానం సంచ‌ల‌న తీర్పుతో న‌గ‌ర‌వాసులు హ‌ర్షం వ్య‌క్త‌ం చేస్తున్నారు. వినియోగ‌దారుల న్యాయ‌స్థానం ఆదేశాలు థియేట‌ర్ల‌లో స‌క్ర‌మంగా అమ‌ల‌య్యేలా అధికారులు నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles