Harivansh Singh elected as RS deputy chairman రాజ్యసభ ఉపసభాధిపతిగా హరివంశ్ సింగ్

Nda candidate harivansh narayan singh elected as rs deputy chairman

rajya sabha deputy chairman election, rajya sabha deputy chairman election date, rajya sabha deputy speaker, Rajya Sabha seats, Rajya Sabha election, Harivansh Narayan Singh, BK Hariprasad, Rajya Sabha members,national politics

BJP-led NDA nominee Harivansh Narayan Singh elected as Rajya Sabha Deputy Chairman with a margin of 20 votes, defeating opposition's BK Hariprasad by getitng 125 votes.

రాజ్యసభ ఉపసభాధిపతిగా హరివంశ్ నారాయణ్ సింగ్

Posted: 08/09/2018 11:54 AM IST
Nda candidate harivansh narayan singh elected as rs deputy chairman

 అధికార, విపక్షాల మధ్య ఉత్కంఠతకు దారితీసిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో అధికార బీజేపి వ్యూహ, ప్రతివ్యూహాలు ఫలించాయి. తమ ఎన్డీయే కూటమి అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ను వవిజయం వరించేలా బీజేపి చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. అధికార పక్షానికి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ జేడీ(యు) అభ్యర్థిగా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా విపక్ష కాంగ్రెస్ కు చెందిన అభ్యర్థి హరిప్రసాద్ ను ఆయన 20 ఓట్ల మెజారిటీతో ఓడించారు. అధికార పక్ష అభ్యర్థికి 125 ఓట్లు పోలవ్వగా విపక్షానికి చెందిన అభ్యర్థికి 105 ఓట్ల మాత్రమే లభించాయి. దీంతో హరివంశ్ సింగ్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైనట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు వెల్లడించారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత వెంకయ్యనాయుడు నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆ తరువాత లాబీలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆపై మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలిచినట్టు ప్రకటించారు. విపక్ష సభ్యులు డివిజన్ కావాలని పట్టుబట్టడంతో ఓటింగ్ నిర్వహించారు. డివిజన్ బెల్ మోగించారు. హరివంశ్ నారాయణ్ కు 115 ఓట్లు, హరిప్రసాద్ కు 98 ఓట్లు వచ్చాయి. సభలో మొత్తం 230 మంది ఉండగా, ఇద్దరు ఎంపీలు ఎవరికీ ఓటు వేయలేదని కౌంటింగ్ నంబర్ బోర్డు తెలిపింది.

దీంతో హరివంశ్ నారాయణ్ విజయం సాధించారని వెంకయ్య నాయుడు ప్రకటించారు. అయితే కొంతమంది రాజ్యసభ సభ్యులు తాము పొరపాటు పడ్డామని, ఓటింగ్ తప్పుగా వేశామని చెప్పారు. మరికొందరు తాము ఓటు వేయలేదని ఫిర్యాదు చేయడంతో మరోసారి డివిజన్ చేశారు. అప్పుడు హరివంశ్ కు 125 ఓట్లు, హరిప్రసాద్ కు 105 ఓట్లు రాగా, ఇద్దరు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరివంశ్ గెలుపును వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా, రాజ్యసభ ఉపసభాపతి అధ్యర్థిగా ఎన్నికైన హరివంశ్ సింగ్ కు ప్రధాని మోడీ సహా పలువురు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Irdai raises minimum driver insurance cover to rs 15 lakh

  ఐఆర్డీఏఐ నిర్ణయం: గణనీయంగా ప్రమాద బీమా సొమ్ము పెంపు..

  Sep 22 | వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలో బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్‌డీఏఐ) సమూల మార్పులు చేసింది. సొంతంగా వాహనాన్ని నడిపే యజమానికి తప్పనిసరిగా వర్తించే వ్యక్తిగత బీమా మొత్తాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు... Read more

 • Ruling party mla kolla lalitha welcomes ys jagan in a indifferent manner

  విజయనగరంలో జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే వినూత్న స్వాగతం

  Sep 22 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధిగా సుమారు 267 రోజులగా ఏకబిగిన పాదయాత్ర చేస్తున్న విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు విజయనగరంలో.., అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అహ్వానాలు... Read more

 • Congress france concealing facts on rafale deal

  రాఫెల్ డీల్: దేశద్రోహానికి పాల్పడిన మోడీ: రాహుల్

  Sep 22 | కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోమారు ప్రధాని నరేంద్రమోడిని టార్గెట్ గా చేసుకుని తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లుగా నీతివంతమైన పాలన, నిజాయితీ, పారదర్శక పాలన అంటూ ఊదరగోట్టిన... Read more

 • Home guard inappropriately touching women and girls on busy street

  ITEMVIDEOS: పోకిరి పోలీసు.. కామాంధుడికి ఎక్కువ.. మీరే చూడండీ

  Sep 21 | ఈవ్ టీజింగ్, అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేసే పోకిరీలను కటకటాల వెనక్కి నెట్టి.. వారికి తామున్నామన్న భరోసాను కల్పించేదే పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కింది స్థాయి సిబ్బందిపైనే... Read more

 • Setback to ap cm chandrababu court orders to appear before it

  చంద్రబాబుకు షాక్.. ‘‘అందరూ హాజరుకావాల్సిందే’’

  Sep 21 | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధర్మాబాద్ న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఆయనపై జారీ చేసిన నాన్ బెయిలెబుల్ వారెంటు నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ధర్మాబాద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాఖలు చేసిన రీకాల్ పిటీషన్... Read more

Today on Telugu Wishesh