Rs 70,000-cr hit banks due to frauds మూడేళ్లలో బ్యాంకు మోసాలు రూ.70వేల కోట్లు

Indian banks take about rs 70 000 crore hit due to frauds in last 3 fiscal

Loan frauds, Wilful default, NPAs, frauds, indian banks, Shiv Pratap Shukla, Finance Ministry, RBI data, NDA

Indian banks reported a total loss of about Rs 70,000 crore due to frauds during the last three fiscals up to March 2018, the Rajya Sabha was informed.

ప్రజలసొమ్ము హారతి.. మూడేళ్లలో బ్యాంకు మోసాలు రూ.70వేల కోట్లు

Posted: 08/08/2018 02:44 PM IST
Indian banks take about rs 70 000 crore hit due to frauds in last 3 fiscal

ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, రుణగ్రహితల మోసాల కారణంగా గడచిన మూడు సంవత్సరాల వ్యవధిలో దేశీయ జాతీయ, ప్రైవేటు బ్యాంకులు రూ. 70 వేల కోట్లను నష్టపోయాయి. మరో విధంగా చెప్పాలంటే రూ. 70 వేల కోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణాలగా పోందిన బడాబాబులు.. బ్యాంకులను మోసం చేసి శఠగోపం పెట్టారు. గత మూడేళ్ల కాలంలో దేశంలోని సామాన్య ప్రజానికం తమ ఖాతాలలో కష్టించి పెట్టుకున్న డబ్బును బ్యాంకులు అప్పనంగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు రుణాలగా అందించాగా, వారు ఎగనామం పెట్టారు.

ఈ మేరకు రాజ్యసభలో ఓ సభ్యుడు అగిడిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రకాప్ శుక్లా రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, 2015-16లో రూ. 16,409 కోట్లు, 2016-17లో రూ. 16,652 కోట్లు, 2017-18లో రూ. 36,694 కోట్లను బ్యాంకులు నష్టపోయినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్టు శుక్లా తెలిపారు.

2007-08 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి వాణిజ్య బ్యాంకుల్లో రూ. 25.03 లక్షల కోట్లుగా ఉన్న స్థూల అడ్వాన్సులు, 2014 నాటికి రూ. 68.75 లక్షల కోట్లకు పెరిగాయని ఈ సందర్భంగా శుక్లా తెలిపారు. బ్యాంకులను రూ. 1000 కోట్లకు పైగా ముంచిన వారి సంఖ్య 139 అని తెలిపారు. వీరందరి బకాయిలూ ప్రస్తుతం నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలో ఉన్నాయని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Loan frauds  Wilful default  NPAs  frauds  indian banks  Shiv Pratap Shukla  Finance Ministry  RBI data  NDA  

Other Articles