PM pays last respects to Karunanidhi కరుణానిధికి ప్రధాని, రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు

Pm and other political leaders pays last respects to dmk patriarch karunanidhi

M Karunanidhi, PM Modi, Nirmala Sitharaman, Mamta benerjee, Congress, Madras High Court, AIADMK, Karunanidhi passes away, Karunanidhi no more, Karunanidhi dies at 94, Karunanidhi death, M Karunanidhi, Kauvery Hospital, Kalaignar, dmk, stalin, CM Palanisamy, President Ramnath Kovind, PM Modi, Governer Narasimhan, Delhi CM Kejriwal, Andhra CM, Chandrababu Naidu, Telangana CM, KCR, Yashwant Sinha, Rajini kanth, Kamal hassan, pawan kalyan, YS Jagan, Radhika, sharatkumar, tamil nadu

PM Modi pay last respects to former chief minister of Tamil Nadu, DMK patriarch M Karunanidhi at the Rajaji Hall in Chennai, accompanied by Defence Minister Nirmala Sitharaman. PM meets Stalin and kanimozhi and condolences them.

ITEMVIDEOS: కరుణానిధికి ప్రధాని, రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు

Posted: 08/08/2018 12:22 PM IST
Pm and other political leaders pays last respects to dmk patriarch karunanidhi

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఢీఎంకే అధినేత, కళైంజ్ఞర్ కరుణానిధికి పలువరు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చెన్నైలోని రాజాజీ హాలు వద్దకు వచ్చిన ప్రధాని మోడీ.. కరుణానిధి పార్థివదేహాం వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అంతకు ముందు ఉదయం 10.38 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మరికొందరు మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు.

కరుణానిధి మరణవార్త తెలిసిన వెంటనే చెన్నైకి చేరుకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఆయన పార్థివ దేహాన్నిసందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం కూడా నివాళులర్పించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన చాంధీ.. సీపీఎం మాజీ జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్, సీపీఐ నేత రాజా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, సహా పలువురు నేతలు కరుణానిధికి పార్థీవదేహాన్ని దర్శించి తమ నివాళులు అర్పించారు.

అటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కరుణానిధి పార్థివదేహానికి నివాళులర్పించారు. సినీనటుడి నుంచి రాజకీయ వేత్తగా మారిన తమిళనటుడు కమల్ హాసన్ కూడా కరుణానిధి బౌతికఖాయానికి దర్శించి అంజలి ఘటించారు. మరో సినీనటుడు అజిత్ కూడా షూటింగ్ రద్దు చేసుకుని చెన్నైకి పయనమయ్యారు. మరోవైపు ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ నేతలు చెన్నై చేరుకోనున్నారు.

కాగా, సాయంత్రం నాలుగున్నర గంటలకు రాజాజీ హాలు నుంచి కలైంజ్ఞర్ కరుణానిధి బౌతికఖాయానికి అంతిమ యాత్ర నిర్వహించనున్నారు. మద్రాసు హైకోర్టు మెరినా బీచ్ లో అంత్యక్రియలకు వ్యతిరేకంగా  దాఖలైన పిటీషన్లు అన్నింటినీ కొట్టివేస్తూ.. కరుణానిధి పార్థీవదేహానికి అంత్యక్రియలను మెరినా బీచ్ లో నిర్వహించేందుకు అనుమతిని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 4.30 గంటలకు రాజాజీ హాలు నుంచి మెరినా బీచ్ వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఆరు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో కరుణానిధికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : M Karunanidhi  PM Modi  Nirmala Sitharaman  Mamta benerjee  kamal hassan  Rajini kanth  KCR  tamil nadu  

Other Articles