Karunanidhi passes away మాజీ సీఎం, కళైంగర్ కరుణానిధి అస్తమయం..

Dmk chief karunanidhi dies of multi organ failure at 94

M Karunanidhi, Karunanidhi passes away, Karunanidhi no more, Karunanidhi dies at 94, Karunanidhi death, M Karunanidhi, Kauvery Hospital, Kalaignar, dmk, stalin, CM Palanisamy, gopalapuram, tamil nadu

DMK patriarch and senior leader M Karunanidhi passed away at Chennai's Kauvery Hospital at 6.10 pm on Tuesday. The former Tamil Nadu chief minister was 94-years-old.

మాజీ సీఎం, డీఎంకే అధినేత.. కళైంగర్ కరుణానిధి అస్తమయం..

Posted: 08/07/2018 06:44 PM IST
Dmk chief karunanidhi dies of multi organ failure at 94

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత.. కళైంగర్ కరుణానిధి ఇవాళ సాయంత్రం అస్తమించారు. అనారోగ్యంతో గత నెల 24న చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరిన ఆయన.. తన అరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6.10 గంటలకు పరమపదించారు. ఆయన చనిపోయిన విషయాన్ని కావేరీ ఆసుపత్రి యాజమాన్యం ధ్రువీకరించింది. ఆయన మరణించారన్న విషయాన్ని ప్రెస్ రిలీజ్‌ ద్వారా ఆసుపత్రి వర్గాలు వెల్లడించింది. అంతకుముందు సాయంత్రం ఆరుగంటలకు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లోనే అసుపత్రి యాజమాన్యం అందోళన వ్యక్తం చేసింది.

గత కొద్ది గంటలుగా ఆయన ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించిందని, సాధ్యమైనంత వరకూ వైద్య చికిత్సనందిస్తున్నామని కానీ ఆయన అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో స్పష్టం చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని, ఏ మాత్రం నిలకడగా లేదని వైద్య బృందం తేల్చి చెప్పింది. అలా బులెటిన్ విడుదల చేసిన తరువాత పది నిమిషాలలో ఆయన చనిపోయారని తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

కరుణ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. వైద్య లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం కరుణానిధి భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. అక్కడ కొన్ని క్రతువులు పూర్తి చేసిన తర్వాత ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు ఆయన పార్థీవదేహాన్ని తరలించనున్నారు.

బుధవారం మెరినా బీచ్ లో ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించననున్నారు. మెరినా బీచ్ లోని అన్నా సమాధి పక్కనే కరుణానిధి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కరుణానిధి
1924 జూన్ 3న జన్మించారు. ప్రస్తుతం ఆయన 94 ఏళ్లు. ముత్తువేల్‌ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్‌, రాజత్తి అమ్మాళ్‌. నాటక రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన ఆయన తరువాత సినిమా రైటర్ గా ఎదిగారు. అక్కడి నుంచి ద్రవీడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన ఐదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1957 నుంచి పోటీ చేసిన ప్రతి ఎన్నికలో గెలుపొందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : M Karunanidhi  Kauvery Hospital  Kalaignar  dmk  stalin  CM Palanisamy  gopalapuram  tamil nadu  

Other Articles