"Lalit Modi, Nirav Modi, Bade Modi Looting India" మోదీ త్రయం దేశానికి శాపం.. దోచేస్తున్నారన్న టీఎంసీ

Lalit modi nirav modi bade modi looting india says trinamool leader

no trust vote, no confidence motion, Saugata Roy, Trinamool Congress, lalith modi, nirav modi, bade modi, Amit Shah, Sumitra Mahajan, BJP, france president, reliance, Rakesh Singh, congress, TDP, galla jayadev, kesineni nani, APSPS, special status, Andhra pradesh, NDA

Calling PM Modi a "travelling salesman" and his economic policies a "disaster", Trinamool Congress lawmaker Saugata Roy said that "three Modis are looting the country".

మోదీ త్రయం దేశానికి శాపం.. దోచేస్తున్నారన్న టీఎంసీ

Posted: 07/20/2018 06:15 PM IST
Lalit modi nirav modi bade modi looting india says trinamool leader

కేంద్రంపై విశ్వాసం లేదనడానికి నిదర్శనమే టీడీపీ అవిశ్వాస తీర్మానమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగత్ రాయ్ విమర్శించారు. ప్రభుత్వంలోకి రాకముందు నుంచి మైత్రిని కొనసాగిస్తూ వచ్చిన మిత్రపక్ష పార్టీ.. నాలుగేళ్లు అధికారంలో వున్న తరువాత కూడా ఇంకా తమకు ప్రభుత్వంపై విశ్వాసం లేదని, అపనమ్మకంతో తీర్మాణాన్ని ప్రవేశపెట్టిన తీరు కేంద్రం వైఖరిని స్పష్టం చేస్తుందని ఆయన విమర్శించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, అవిశ్వాసం అంటే సంఖ్యాబలానికి సంబంధించింది కాదని అన్నారు.

దేశానికి మోదీల త్రయం శాపంలా పరిణమించిందని, ఈ త్రయం దేశాన్ని దోచుకోవడంలో ఘనతకెక్కారని తూర్పారబట్టారు. వీరిలో ఒకరు లలిత్ మోడీ, మరోకరు నిరవ్ మోడీ అయితే మూడో వ్యక్తి పెద్ద మోడీ అని పేరు ఉచ్చరించకుండా అరోపించారు. కేంద్ర ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని తమ నాయకురాలు మమతాబెనర్జీ పదేపదే చెబుతున్నారని, ప్రధాని మోదీ ట్రావెల్ సేల్స్ మెన్ గా మారారని, గాలిలో తిరిగే వాళ్లు ప్రధాని అయితే, దేశానికి అంత మంచిదికాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నాలుగేళ్లలో 84 దేశాలను చుట్టుముట్టిన ప్రధాని మోడీ.. ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ఇన్ని దేశాలను సంచరించేందుకు ఆయన నాలుగేళ్లలో సుమారు రూ. 1500 కోట్లు ప్రజాధనాన్ని వినియోగించారని అన్నారు. అక్కడికెళ్లిన తరువాత వివిధ దేశాధిపతులతో కలసిన మోడీ.. ప్రధాని హోదాలో కాకుండా.. తనకు అ దేశాధ్యక్షులు మిత్రులని అత్యంత బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని.. బరాక్ ఒబామా ఘటనను ఊటంకిస్తూ ఆయన వివరించారు. దేశంలో ప్రతి ఏటా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతూనే ఉందని, కనీస మద్దతు ధర కంటితుడుపు చర్యగానే ఉందని, వరికి కనీస మద్దతు ధరను రూ.2 వేల నుంచి రూ.2,500 ఇవ్వాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.

పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఎవరైనా బాగుపడ్డారా అని చూస్తే కేవలం ఒక్క మోటా భాయ్ తప్ప ఎవరికీ లాభం చేకూరలేదని పరోక్షంగా అమిత్ షా పై అరోపణలు చేశారు. నోట్ల రద్దుతో 25 లక్షల మంది ఉపాధి కోల్పోయారని, ఇది దేశానికి ప్రధాని ఇచ్చిన బహుమతి అని, నల్లధనం విషయంలో కేంద్రం ఏమి సాధించింది? అని ప్రశ్నించారు. ఖరీఫ్ అమ్మకాలు, రబీ కొనుగోళ్ల సమయంలో పెద్దనోట్లు రద్దు చేశారని, పెద్దనోట్లు రద్దు అనంతరం బ్యాంకులన్నీ నోట్ల మార్పిడిలో మునిగిపోయాయని, రైతులకు కనీసం పంట రుణాలు ఇచ్చే తీరిక కూడా వాటికి లేదని మండిపడ్డారు. కిసాన్ ర్యాలీల పేరుతో వేల కోట్ల రూపాయలను ప్రధాని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అదే ధనాన్ని రైతుల సంక్షేమానికి వెచ్చిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా జరిగిన మూక దాడుల్లో ప్రజలు మరణిస్తున్నా కేంద్రం నుంచి స్పందన ఉండదని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : no confidence motion  Saugata Roy  Trinamool Congress  Sumitra Mahajan  BJP  AP special status  NDA  

Other Articles