BJP's Rakesh Singh slams Congress for dynastic politics కాంగ్రెస్ పై విమర్శలు సంధించిన బీజేపి

Bjp s rakesh singh speaks in lok sabha on no confidence motion

no trust vote, no confidence motion, Sumitra Mahajan, BJP, Rakesh Singh, congress, TDP, galla jayadev, kesineni nani, APSPS, special status, Andhra pradesh, NDA

Accusing Congress of having used politics to serve vested interests, BJP's Rakesh Singh opened his party's attack during Friday's no-confidence motion debate in Lok Sabha.

అవిశ్వాసంలోనూ అదే పద్దతి: కాంగ్రెస్ పై విమర్శలు సంధించిన బీజేపి

Posted: 07/20/2018 02:45 PM IST
Bjp s rakesh singh speaks in lok sabha on no confidence motion

ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బీజేపీకి కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుందని, ఆ పార్టీ శాపానికి గురి కానుందని అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. "గల్లా గారూ... మీరు బీజేపీకి శాపం తగులుతుంద’’ని వ్యాఖ్యానించారు. మీరే శాపగ్రస్తులయ్యారని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పక్కన చేరి రాజకీయం చేస్తున్న మీరే స్వయంకృతాపరార్థంతో శాపగ్రస్తులుగా మారారని వ్యంగంగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ప్రారంభించిన కుమారస్వామి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని దేశమంతా చూశారని అన్నారు. ఆయన తాను పాలల్లో విషాన్ని వేసుకుని తాగుతున్నానని చెప్పిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయని.. త్వరలో మీరు ( టీడీపీ) కూడా గరళాన్ని మింగేందుకు సిద్దంగా వుండాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు బీజేపిని వెలేస్తారని ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. లేసేది బీజేపీని కాదని.. టీడీపీనేనని తొందర్లోనే తెలుస్తుందని అన్నారు.

దీంతో బీజేపీ సభ్యులు బల్లలు చరచగా, టీడీపీ సభ్యులు మాత్రం సభలో నిరసన తెలిపారు. ఆపై తన ప్రసంగాన్ని కొనసాగించిన రాకేష్ సింగ్.. స్వతంత్ర్య భారత దేశంలో 70 ఏళ్లుగా రాని మార్పు నరేంద్రమోడీ హయంలో నాలుగేళ్లలో సాధించామని అన్నారు. అనేక గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం మోదీ ఘనతేనన్నారు. దేశంలోని పేదలకు, బడుగులకు, మహిళలకు లబ్ది చేకూర్చే విధంగా మోడీ అనేక సంక్షేమ పథాకాలను ప్రారంభించారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అదుకునేందుకు మోడీ నిత్యం శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వల్లేవేసిన ఆయన కాంగ్రెస్ ఏం చేసిందని నిందారోపణలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles