YS jagan draws huge crowds in kakinada జగన్ సభకు అసంఖ్యాక జనం.. కాకినాడ అదుర్స్..

Ys jagan draws huge crowds in kakinada

Praja Sankalpa Yatra, YS Jagan Mohan Reddy, jagan padayatra, ysrcp, Praja Sankalpa Yatra, Kakinada, East Godavari, social media, andhra pradesh, politics

YSRCP president Y.S. Jagan Mohan Reddy addressing a public meting in Kakinada, where the people turn out to the meeting appears like tsunami.

జగన్ సభకు అసంఖ్యాక జనం.. కాకినాడ అదుర్స్..

Posted: 07/19/2018 11:29 AM IST
Ys jagan draws huge crowds in kakinada

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 200 రోజులకు పైగా కొనసాగిస్తున్న అత్యంత ప్రజాదరణను కూడా కూడగట్టుకుంటుంది. ఈ క్రమంలో క్రితం రోజున తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోకి ప్రవేశిస్తున్న వేళ ఆయనను చూసేందుకు సభకు హాజరయ్యేందుకు ఓటర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయన సభ సందర్భంగా వచ్చిన వైఎస్సార్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో జనసంద్రాన్ని కాకినాడ తలపించింది.

అభిమానులు అసంఖ్యకంగా వచ్చిన తరుణంలో పలు ఛానెళ్లు, మీడియా వైసీపీ అభిమానులను తమ ఫోటోలలో బంధించారు. అయితే ప్రస్తుతం మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకు.. ఏమిటీ ఫోటో ప్రత్యేకత అని అంటారా.? జగన్ సభకు వచ్చిన ప్రజలను డ్రోన్ కెమెరాతో ఫోటో తీయడం.. అందులో జనసంఖ్య ఇసుకేసినా రాలనంతగా వుండటంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొవ్వాడ రహదారిపై రైలు పట్టాలు దాటగానే ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ కటౌట్ మధ్య నుంచి జగన్ వెళుతున్న వేళ తీసిన వీడియో ఇది. తనకు ఘన స్వాగతం చెబుతున్న ప్రజలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు జగన్.

ఆపై కాకినాడలో జరిగిన బహిరంగ సభలో కిక్కిరిసిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, చంద్రబాబు, బీజేపీతో బయటకు యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తూ, లోపల నేతలతో కాళ్ల బేరానికి దిగారని విమర్శించారు. రైతులను మోసం చేయడంలో ఆయనే నంబర్ వన్ అని, ఏ హామీనీ ఆయన అమలు చేయలేదని ఆరోపించారు. "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" అవార్డును ఏపీ సర్కారుకు ప్రకటించిన వారికి బుద్ధుందా? అని ప్రశ్నించారు. ఈజ్ అప్ కర్పక్షన్ లో రాష్ట్ర ప్రథమస్థానంలో వుందని జగన్ దుయ్యబట్టారు. హోదా విషయంలో తాము ఎవ్వరినీ నమ్మడం లేదని, మొత్తం 25 ఎంపీ సీట్లనూ వైసీపికి ఇస్తే, ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Praja Sankalpa Yatra  YS Jagan  Kakinada  East Godavari  social media  andhra pradesh  politics  

Other Articles