sugar baron accused of Rs5,500cr scam రైతుల రక్తం పీల్చే జలగ.. బ్యాంకులకు రూ.వేల కోట్ల టోకరా..

Maharashtra businessman allegedly got 5 400 crores loans in farmers name

Ratnakar Gutte Scam, Maharashtra Businessman Scam, Ratnakar Gutte, Maharashtra Businessman, Maharashtra, Maharashtra Businessman Loans, Maharashtra Legislative Council, Dhananjay Munde, sugar baron ratnakar gutte, farimers land, bank loans, sugar baron, maharashtra, businessman

Calling the issue a very serious one, Dhananjay Munde said that any laxity on the part of the government could allow the businessman to flee the country like PNB scam-accused diamantaire Nirav Modi.

రైతుల రక్తం పీల్చే జలగ.. బ్యాంకులకు రూ.వేల కోట్ల టోకరా..

Posted: 07/18/2018 06:51 PM IST
Maharashtra businessman allegedly got 5 400 crores loans in farmers name

విజయ్ మాల్యా, నీరవ్ మోడీల తరహాలో బ్యాంకులకు టోపీ వేశాడు మహారాష్ట్రలో ఒక బడాబాబు. పేరుకు పారిశ్రామిక వేత్తే అయినా.. రైతు రక్తాన్ని పిల్చే జలగ మాదిరిగా తయారైయ్యాడు. రైతుల భూములకు సంబంధించిన నకిలీ పత్రాలను సృష్టించి.. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేసి వేల కోట్ల రూపాయలను దండుకున్నాడు. ఇంతకీ ఆ పారిశ్రామికవేత్త ఎవరని అంటారా.? అతనే రత్నాకర్ గుత్తే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. రూ. 5,400 కోట్ల రుణాలను  రైతుల పేరు మీద తీసుకున్నాడు ఈ బుట్టాచోర్.

అప్పు చేసి దానిని కట్టేందుకు పూట తిండి కూడా మానేవేసే సామాన్య రైతులు బ్యాంకులకు వెళ్తే చీదరించుకున్నట్టు చూసే బ్యాంకు యాజమాన్యాలు.. నకిలీ పత్రాలను సృష్టించిన ఘనుడికి మాత్రం ఎలాంటి ఎంక్వైరీలు లేకుండా అడిగిన వెంటనే కాదనకుండా క్యూ కట్టి మరీ అప్పులను ఇచ్చారు. ఈ మేరకు మహారాష్ట్ర శాసన మండలిలో విపక్ష నేత ధనంజయ్ ముండే వెల్లడించారు. నకిలీ పత్రాలు చూపించి అతను భారీగా వ్యవసాయ రుణాలు పొందాడని ఆయన ఆరోపించారు. పీఎన్బీ కుంభకోణంలో నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ తరహాలో రత్నాకర్ దేశం విడిచి పారిపోకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి అతనిని చట్టం ముందుకు తీసుకు రావాలని ముండే డిమాండ్ చేశారు.

పర్భనీ జిల్లాలోని గంగాఖేడ్ షుగర్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ప్రమోటర్ అయిన రత్నాకర్ గుత్తే రైతుల పేరిట నకిలీ పత్రాలు సృష్టించి వివిధ బ్యాంకుల నుంచి రూ.5,400 కోట్ల మేర రుణాలు తీసుకున్నాడు. ఆ డబ్బును వేర్వేరు ఖాతాల్లోకి మళ్లించాడు. ఇందుకోసం గుత్తే 22 షెల్ కంపెనీలు ప్రారంభించాడని ముండే ఆరోపించారు. 2015లో గంగాఖేడ్ షుగర్ ఫ్యాక్టరీ 600కి పైగా రైతుల పేరు మీద బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొంది. ఆ అప్పులు కట్టాలని రైతులకు బ్యాంకులు నోటీసులు పంపించాయి. అందులో కొందరికి రూ.25 లక్షలు చెల్లించాలని తాఖీదులు రావడంతో ఆ రైతులు షాకయ్యారు.

గంగాఖేడ్ షుగర్ ఫ్యాక్టరీ అండ్ ఎనర్జీ లిమిటెడ్ గ్రూప్ లోని పలు కంపెనీలు షెల్ కంపెనీలేనని ముండే తెలిపారు. జూలై 5న రత్నాకర్ గుత్తేపై ఐపీసీ పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైంది కానీ ఇప్పటి వరకు అతనిని అరెస్ట్ చేయలేదని ధనంజయ్ ముండే చెప్పారు. ఈ వ్యవహారంలో జాప్యం ఎంత మాత్రం పనికి రాదని.. వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే గుత్తే కూడా నీరవ్ మోడీ తరహాలో తప్పించుకొని విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ratnakar Gutte  Dhananjay Munde  farimers land  bank loans  sugar baron  maharashtra  businessman  

Other Articles