Tamil actress Priyanka commits suicide తమిళ యువనటి ప్రియాంక ఆత్మహత్య..

Vamsam fame tv serial actress priyanka commits suicide

TV,TV serial actress Priyanka,TV actress Priyanka committed suicide,Tamil TV actress Priyanka death,Tamil serial actress Priyanka dead,Ramya Krishnan TV serial,Tamil serial Vamsam,Actress Priyanka Valasaravakkam residence, Priyanka, TV actress, suicide,Tamil actress, Ramya Krishnan TV serial, Vamsam, Valasaravakkam, Crime

Popular TV serial actress Priyanka, who is known for her role in Ramya Krishnan's Tamil serial Vamsam, has reportedly committed suicide early this morning at her residence in Valasaravakkam.

తమిళ యువనటి ప్రియాంక ఆత్మహత్య..

Posted: 07/18/2018 12:26 PM IST
Vamsam fame tv serial actress priyanka commits suicide

యువనటి, పలు తమిళ టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించిన ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడింది. రమ్యకృష్ణన్ తమిళ సీరియళ్లలో సూపర్ హిట్ అయిన 'వంశం'లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్న ప్రియాంక ఇవాళ ఉదయం వలసరవాక్కంలోని తన ఇంట్లోనే విగతజీవిగా కనిపించింది. తన ఇంట్లోనే అమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.

ఈ ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చేసరికి తన గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించగా, విగతజీవిగా మారిన అమెను చూసిన పనిమనిషి వెంటనే ఈ సమాచారాన్ని పోరుగింటి వారికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రియాంక ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

కాగా ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్న వైద్యులు కూడా పోస్టుమార్టం తరువాత కానీ అసలు విషయాన్ని నిర్థారించలేమని తెలిపారు. ముఫై రెండేళ్ల ప్రియాంక అరుణబాలా అనే వ్యక్తిని మూడేళ్ల క్రితం వివాహం చేసుకుందని, అయితే వారి మధ్య అభిప్రాయబేధాలు వచ్చి గత రెండేళ్ల క్రితం విడిపోయారని, వీరికి సంతానం కూడా లేరని తెలుస్తుంది. కుటుంబ విభేదాలే ప్రియాంక ఆత్మహత్యకు కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో మరింత సమాచారం తెలియాల్సివుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka  TV actress  suicide  Tamil actress  Ramya Krishnan TV serial  Vamsam  Valasaravakkam  Crime  

Other Articles