Chennai rape case accused filmed raping మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో విస్తుపోయే నిజాలు..

Chennai rape 17 accused filmed each other raping the child

Madras High Court Advocates Association, Madras High Court, Advocates Association, MHAA, Mohanakrishnan, mahila court, judicial custody, Tamil Nadu sexual assault, Chennai, Chennai crime, child raped, Rape, Minor girl raped in Chennai, Tamil Nadu, Minor raped for 7 months

Chennai police arrested 17 men including security guards, electricians and plumbers who allegedly raped an 11-year-old hearing impaired girl in an apartment block over the past seven months. The Advocates Association decided no member would appear before any court on behalf of accused.

మైనర్ గ్యాంగ్ రేప్ కేసులో విస్తుపోయే నిజాలు.. లాయర్లు కూడా..

Posted: 07/18/2018 10:34 AM IST
Chennai rape 17 accused filmed each other raping the child

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చెన్నై బధిర బాలిక రేప్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 11 ఏళ్ల బధిర బాలికపై మొత్తం 24 మంది నిందితులు గత అరు నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్న విషయం బయటపడి సంచలనం కాగా, అందులో 17 మంది నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి మహిళా న్యాయస్థానంలో హాజరుపర్చారు. నిందితులను చూసి వారు చేసిన దారుణ ఘటనలు విని చెల్లించిపోయిన న్యాయవాదులు.. వారిని న్యాయస్థానం అవరణలోనే కిందపడేసి మరీ దాడిచేసి బుద్దిచెప్పారు.

సమయానికి పోలీసులు రాకపోయి వుండివుంటే.. నిందితుల్లో కొందరు దెబ్బలు తాళలేక అసువులు బాసివుండేవారన్న వార్తలు కూడా వచ్చాయి. కాగా ఇప్పుడీ కేసులో మరో నిర్ఘాంత పరిచే ఘటన వెలుగుచూసింది. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సెక్యూరిటీ గార్డులు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్, లిఫ్ట్ ఆపరేటర్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరో దారుణమైన విషయం ఏంటంటే.. బాలికపై తాతయ్య వయస్సున్న 66 ఏళ్ల వ్యక్తి.. స్థానికంగా లిప్ట్ అపరేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నిందితుడు బాలికను తొలుత అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

బాలిక స్కూలుకు వెళ్లి వచ్చిన తర్వాత నిర్మాణంలో ఉన్న భవనం చుట్టూ సైకిల్ తొక్కుతుండగా..  బాలికను తన మాటలతో మభ్యపెట్టిన వృద్దుడు.. తన మనమరాలి వయస్సున్న బాలిక అన్న కనీసం ఇంకితం లేకుండా.. చిన్నారిపై పైశాచిక మృగంలా పడి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన నేరం ఎప్పటికీ బయటపడకుండా అలోచన చేసిన నిందితుడు.. తనకు పరిచయం వున్న సెక్యూరిటీ గార్డులు, భవన నిర్మాణంలో పనిచేస్తున్న పరిచయస్థులైన ప్లంబర్లను బాలిపై అత్యాచారానికి పురిగొల్పాడు.

తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి బాలికపై అత్యాచారానికి పాల్పడిన తరువాత మిగతా వారిని లిఫ్ట్ ఆపరేటర్ తన పరిచయస్థులను ఉసిగొల్పాడని, వారు బాలికపై అత్యాచారం చేస్తూ వీడియోలు తీశారని పోలీసులు వివరించారు. బాధిత బాలిక నిందితులందరినీ గుర్తించిందని పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో నలుగురు నేరాన్ని అంగీకరించారని, ఇద్దరు మాత్రం తాము లైంగిక వేధింపులకు గురిచేశామని అంగీకరించినట్టు పేర్కొన్నారు. కేసును మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

కాగా, పరారీలో వున్న మరో ఏడుగురు నిందితులు కూడా ఈ అత్యాచార ఘటనలో వున్నారా లేదా.? అన్నది దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. ఇక వారు కూడా తమ సెల్ ఫోన్లలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను తీశారా.? లేదా.? అన్నది ఇప్పుడే తెలియదని చెప్పారు. ఇదిలావుండగా, మద్రాసు హైకోర్టు న్యాయవాదులు అసోసియేషన్ కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుల తరపున తమ సభ్యులెవ్వరూ వాదించరని అసోసియేషన్ అధ్యక్షుడు మోహనకృష్ణన్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madras High Court  Advocates Association  MHAA  Mohanakrishnan  mahila court  judicial custody  crime  

Other Articles