pawan kalyan inaugurates IT, Knowledge hub of JanaSena జనసేన నాలెడ్జ్, ఐటీ హబ్ ప్రారంభం

Pawan kalyan inaugurates it knowledge hub of janasena

pawan kalyan, janasena, pawan kalyan, janasena, JSP IT Centre, JSP Knowledge Hub, Raidurgam, Hyderabad, andhra pradesh, politics, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, Pawan Kalyan uttatandhra porata yatra, Pawan Kalyan IT centre, Jana Sena Kwonledge hub, Raidurgam, Hyderabad, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan inaugurates JSP IT Centre, and Knowledge Hub at Raidurgam, Hyderabad.

ITEMVIDEOS: జనసేన నాలెడ్జ్, ఐటీ హబ్ లను ప్రారంభించిన పవన్ కల్యాన్

Posted: 07/17/2018 05:41 PM IST
Pawan kalyan inaugurates it knowledge hub of janasena

రాష్ట్ర రాజకీయాల్లో సమూల మార్పులను తీసుకువచ్చేలా జనసైనికులు నిత్యం కృషి చేయాలని పవన్ కల్యాన్ తన సైనకు పిలుపునిచ్చారు. సామాజక రాజకీయ వ్యవస్థను బాద్యాతయుతంగా మలిచడంలో జనసైనికులు తోడ్పాటు అత్యంత అవసరమని ఆయన అన్నారు. ఇలాంటి వ్యవస్థ మన తెలుగు రాష్ట్రాలలో రావాలని కాంక్షిస్తూ.. ఆ దిశగా అడుగులు వేస్తున్న జనసేన తమ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసేందుకు జనసేన ఐటీ, నాలెడ్జ్ హబ్ దోహదం చేస్తాయని ఆయన పవన్ కల్యాన్ అన్నారు.

హైదరాబాద్ రాయదుర్గంలో జనసేన ఐటీ సెంటర్ తో పాటు నాలెడ్జ్ హబ్ ను జనసేనాని ప్రారంభించారు. అనంతరం ఆయన కార్యాలయాన్ని పూర్తిగా పరిశీలించారు. తన ఛాంబర్ లోకి వెళ్లి పరిశీలించారు. ఆ తరువాత కార్యాలయం సమావేశ హాల్లో వున్న కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, లోటుపాట్లను ఎప్పటికప్పుడు జనసేన నేతలకు, జనసైనికులకు అందించడమే ఐటీ సెంటర్ నాలెడ్జ్ హబ్ ల ముఖ్య ఉద్దేశ్యమని పవన్ కల్యాన్ అన్నారు.

గతంలో మిస్డ్ కాల్ తో జనసేనలో దాదాపుగా పది లక్షల మంది సభ్యులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని, వారిలో దాదాపుగా 8 లక్షల మందికి జనసేన అవిర్భావం.. అవశ్యకత.. అన్న అంశాలతో పాటు బాధ్యతాయుతమైన జవాబుదారి ప్రభుత్వ ఏర్పాటు అనే అంశాలపై కూడా అవగాహన కల్పించామని అన్నారు. ఇక త్వరలోనే మరో ఇరవై మంది జనసైనికులు లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా 2 కోట్ల మంది తమ పార్టీ సభ్యత్వాలు పొందాలన్నదే లక్ష్యంగా జనసైనిక వాలెంటీర్లు కదులుతున్నారని పవన్ అన్నారు.

పార్టీ నిర్మాణం రాత్రికి రాత్రి జరిగిపోయే పనికాదని, చాలా ఒప్పగ్గా, సహనంతో చేయాల్సి వుంటుందని జనసేనాని అన్నారు. జనసేన అవిర్భావ సందర్భంలోనే తాను పాతిక సంవత్సరాలు దేశం కోసం, మన సమాజం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం తాను పనిచేయాల్సి వస్తుందని లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పానని అన్నారు. అయితే అప్పటి వరకు ఏయే వర్గాల ప్రజలు వ్యవస్థ అవసరాన్ని కావాలనుకుంటున్నారో.. ఏయే వర్గాలు పాలక వర్గాల నిర్లక్ష్యానికి గురవుతున్నాయో.. అయా వర్గాలకు జనసేన అండగా నిలుస్తుందని, వారికి మరింత చేరువవుతామని పవన్ అన్నారు.

అనంతరం జనసేన ప్రధాన కార్యదర్శి మాజీ ఐఏఎస్ అధికారి తొట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. జనసేన సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ద్వారా పాతిక లక్షల మంది తమను సంప్రదించారని, వారి డాటాను పొందుపర్చి వారిని తిరిగి సంప్రదించి అందరికీ సభ్యత్వాలను అందిస్తున్నామని చెప్పారు. ఇక ఐటీ సెంటర్ ద్వారా అటు పార్టీ కార్యకర్తలందరినీ పవర్ స్టార్ పవన్ కల్యాన్ కలుస్తారని, అందరితోనూ కాంటాక్టు అయ్యేందుకు ఐటీ సెంటర్ దోహదపడుతుందని అన్నారు. వీరితోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతీ ఓటరుతో కూడా పవన్ కల్యాన్ ఇంటరాక్ట్ అవుతారని చంద్రశేఖర్ తెలిపారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  JSP IT Centre  JSP Knowledge Hub  Raidurgam  Hyderabad  andhra pradesh  politics  

Other Articles