redwood smuggler haribabu arrested జబర్థస్త్ కమేడియన్ హరిబాబు అరెస్టు..

Jabardast comedian and redwood smuggler hari babu arrested

Red Sandal Smuggler, Hari babu, Lady getup artist, Red Sandal, jabardast artist, jabardasth comedian, Jabardast, tirupati, tollywood, Crime

jabardast comedian, Artist Hari babu, who was on the run after ap police investigation found that he is most wanted red sandal smuggler, been arrested in tirupati.

ఎర్రచందనం కేసులో జబర్థస్త్ కమేడియన్ హరిబాబు అరెస్టు..

Posted: 07/17/2018 04:52 PM IST
Jabardast comedian and redwood smuggler hari babu arrested

అర్టిస్టుగా జీవితాన్ని ప్రారంభించి.. అనతికాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగి.. సినీ ప్రోడ్యూసర్ స్థాయికి ఎదిగటంతో అనుమానాలు కలిగిన పోలీసులు.. ఆరా తీయగా, అతని వెనుకనున్న డొంక మొత్తం కదిలింది. ఎర్రచందనం కేసులో బుల్లితెర కమెడియన్, జబర్దస్త్ ద్వారా పేరుప్రఖ్యాతులను సాధించిన హరిబాబును ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా అతని కోసం టాస్క్ పోర్స్‌ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఆరు సంవత్సరాలుగా ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు..హరిబాబును తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు.

ఒకప్పుడు బతుకు దెరువు కోసం టీవీ సీరియల్స్‌ లో  చిన్న క్యారెక్టర్లు వేసే క్యారెక్టర్‌ ఆర్టిస్‌ హరిబాబు . తిరుపతిలో ఓ సాధారణ ఉద్యోగిగా ఉన్న హరిబాబు.. ఉన్నట్టుండి కోట్లకు పడగలెత్తాడు. హరిబాబు అక్రమంగా సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నాడని సమాచారం రావడంతో..అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవలే ఓ కమెడియన్‌ సినిమాకు హరిబాబే పెట్టుబడి పెట్టినట్లు టాలీవుడ్ టాక్.

తిరుపతిలో టాస్క్‌ఫోర్స్‌ సీఐ మధుబాబు నేతృత్వంలో మంగళవారం హరిబాబును అరెస్టు చేశారు. సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న స్మగ్లర్‌ హరిబాబుపై 10 పోలీస్‌ స్టేషన్లలో 13 కేసులకు పైగా నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మీడియా ముందు వివరిస్తామన్నారు తిరుపతి పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles