Private school teachers call for bandh రేపు ప్రైవేటు స్కూళ్ల బంద్: టీపీటీఎఫ్

Private school teachers call for bandh tomorrow 12 000 schools to be hit

Telangana Private school teachers, Private school teachers, bandh, Telangana, TPTF, Shabir Ali, schools, go ms, cbse, Bandh, Legislative council, Private school teachers demands, health cards, pension, telangana

Private schools across the Telangana remain close in the wake of a state-wide private school bandh call given by TPTF, demanding implementation of GO MS No1, 1994, and sanction of health cards with accident insurance for the teachers working in private schools.

రేపు ప్రైవేటు స్కూళ్ల బంద్: టీపీటీఎఫ్

Posted: 07/17/2018 03:56 PM IST
Private school teachers call for bandh tomorrow 12 000 schools to be hit

ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఐక్యంగా సమరశంఖం పూరించారు. ఓ వైపు యాజమాన్యాల బెదిరింపులు, మరోవైపు భద్రత లేని ఉద్యోగం వుంటుందో.. వూడుతుందో తెలియక సందిగ్ధావస్థ నుంచి బయటపడి.. తమ హక్కుల కోసం కదం తొక్కనున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులతో సమానాంగా హెల్త్ కార్డులను అందించాలని. ఏడాదికి పన్నెండు నెలల వేతనాన్ని కూడా తప్పక అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ.. రేపు రాష్ట్రవ్యాప్త ప్రైవేటు పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చారు.

దీంతో రాష్ట్రంలోని 12వేల పైచిలుకు వున్న ప్రైవేట్ స్కూల్స్ లో జూలై 18వ తేదీ బుధవారం విధులు బహిష్కరించాలని పిలుపునిచ్చింది తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం (టీపిటీఎఫ్). ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాయి. ఉద్యోగ భద్రత కోరుతున్నాయి. ముఖ్యంగా జీవో ఎంఎస్ నెంబర్ 1, 1994 ప్రకారం.. అన్ని ప్రైవేట్ స్కూల్స్ విధిగా టీచర్లకు యాక్సిడెంట్ ఇన్యూరెన్స్ ఇవ్వాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం అమలు కావటం లేదు. ఈ నిబంధన అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రైవేట్ టీచర్ల డిమాండ్లు ఇవే :

* 50 ఏళ్లు నిండిన ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ప్రతి నెలా రూ.5వేల పెన్షన్ ఇవ్వాలి.
* ప్రైవేట్ స్కూల్ టీచర్లకు గుర్తింపు కార్డుతోపాటు ESI, PF సదుపాయం కల్పించాలి.
* జీతాలు బ్యాంక్ ద్వారానే చెల్లించాలి.
* టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి
* అందరికి విద్య చట్టం కింద ప్రైవేట్ స్కూల్స్ లోని 25శాతం సీట్లను పేద విద్యార్థులకు ఇవ్వాలి.
* చిన్న ప్రైవేటు స్కూల్స్ కు ఆస్తిపన్నును రద్దు చేయాలి.

ప్రైవేట్ టీచర్ల బంద్ కు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్, టీచర్స్ అసోసియేషన్స్, సంక్షేమ స్వచ్చంధ సంస్థలు మద్దతు ప్రకటించాయి. ఏడాదిలో 12 నెలలు ఉంటే.. ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్లకు కేవలం 10 నెలలకు మాత్రమే జీతాలు ఇస్తున్నారని.. ఇది అన్యాయం అంటోంది ఫోరం. 2018, జూలై 18వ తేదీ బుధవారం రాష్ట్రంలోని 12వేల స్కూల్స్ లో పని చేస్తున్న టీచర్స్ అందరూ బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Private school teachers  bandh  Telangana  TPTF  Shabir Ali  schools  go ms  cbse  Bandh  Legislative council  

Other Articles