IPS officer in the dock for alleged extra marital affair కర్ణాటక ఐపీఎస్ అధికారి అక్రమసంబంధం.. దర్యాప్తు

Ips officer in the dock for alleged extra marital affair

Indian Police Service, Bengaluru, Affair, Indian Police Service, Bengaluru, Affair, IPS officer video, IPS officer affair video, Bhimashankar Guled, software engineer, software engineer's wife, extra-marital affair

A senior officer heading the Bengaluru Rural district police has caused much embarrassment to the force after a software engineer filed a complaint with the Koramangala police accusing him of having an affair with his wife.

ITEMVIDEOS: కర్ణాటక ఐపీఎస్ అధికారి అక్రమసంబంధం.. దర్యాప్తు

Posted: 07/16/2018 07:51 PM IST
Ips officer in the dock for alleged extra marital affair

గౌరవప్రదమైన పోలీసు అధికారి హోదాలో ఉండి.. ఓ ఐపీఎస్ అధికారి చేయరాని తప్పు చేశాడు. వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో అగకుండా కొత్త మురిపేం నేపథ్యంలో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహితతో చనువుగా వుంటూ.. తాళి కట్టిన భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో విషయం తెలుసుకున్న ఆయన భార్య.. ఎస్పీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే తనకు ఎవరితోనూ అక్రమ సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసిన ఐపీఎస్ అధికారిపై ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది.

హోంశాఖ ఆదేశంతో కేసు నమోదు చేసుకున్న బెంగళూరు అర్బన్ జిల్లాలోని కోరమంగళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అసలేం జరిగిందన్న వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. వారి కథనం ప్రకారం.. డీజీపీని కలిసిన ఎస్పీ డాక్టర్‌ భీమాశంకర్‌ గుళేద భార్య.. భర్త తనను చిత్రహింసలకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. దావణగెరెకు చెందిన ఓ మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలను అందజేస్తూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన డీజీపీ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

అక్కడ ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తన భర్తతోపాటు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ తన భార్య మానసిక వ్యాధితో బాధపడుతోందని పేర్కొన్నారు. ఆమెకు కొందరు తనపై లేనిపోనివి నూరిపోశారని ఆరోపించారు. వారి ప్రోద్బలంతోనే ఆమె కేసు పెట్టారని పేర్కొన్నారు. బాధితురాలి పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఎస్పీపై దర్యాప్తు చేయాలని కోరమంగళ పోలీసులను ఆదేశించింది. ఇక ఇదే సమయంలో వివాహిత భర్త కూడా ఎస్పీపై తన భార్యను అక్రమంగా బంధించాడని ఫిర్యాదు చేయడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles