minister vs ci: phone audio leak సిఐ వర్సెస్ మినిస్టర్.. కేసు నమోదు

Minister jupally krishna rao lodged complaint on phone leaked

minister vs ci, Minister Jupally Krishna Rao, CI Janardhan Reddy, phone audio leak, manchiryala, tandur, peddapalli, dharmaram, civil case, media, crime

Minister Jupally Krishna Rao Lodged Complaint On CI Janardhan Reddy, for Leaking his Phone audio Recording to media.

ITEMVIDEOS: సిఐ వర్సెస్ మినిస్టర్.. కేసు నమోదు

Posted: 07/16/2018 01:20 PM IST
Minister jupally krishna rao lodged complaint on phone leaked

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వివాదంలో చిక్కున్నారు. ఓ సీఐతో మాట్లాడుతూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతున్నాయి. అయితే మంత్రి ఓఎస్డీ లింగారెడ్డి మాత్రం సిఐ జనార్థన్ రెడ్డే మంత్రిగారిపై దుర్బాషలాడారని, ఇందుకు సంబంధించిన అడియో టేపుల్లోని సారాంశాన్ని కూడా కత్తెరింపుల తరువాత మీడియాకు విడదుల చేశారని, ఈ క్రమంలో జనార్థన్ రెడ్డితో పాటు ఆయన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియాపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన సైఫాబాద్ పోలీసులకు పిర్యాదు చేశారు.

మంత్రి జూపల్లి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) వీరారెడ్డికి.. జనార్దన్ ఫోన్ చేసిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. అయితే వారిద్దరి మధ్య సంభాషణ సాగుతుండగానే ఫోన్ తీసుకుని మాట్లాడిన మంత్రి తాను ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్పాడు. అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడ్డాడన్న విమర్శలు వినబడుతున్నాయి. సీఐ జనార్థన్ రెడ్డితో "నేను జూపల్లి కృష్ణారావు... మినిస్టర్‌ ను మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? తమాషా చేస్తున్నవా? గంటలో ఐజీ ఫోన్‌ చేస్తడు. ప్రభుత్వమంటే ఏంటో చూపిస్తా. ఏయ్‌... నీ పేరేంటి? నీది ఏ స్టేషన్‌? చెప్పేది విను. ఈ నంబర్‌ ను డీజీకి ఫార్వర్డ్‌ చేస్తా" అని జూపల్లి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని ఓ భూవివాదం నేపథ్యంలో మంచిర్యాల జిల్లా తాండూరు సీఐ జనార్దన్ రెడ్డిని జూపల్లి బెదిరించారు. మధ్యలో ఫోన్ తీసుకున్న మంత్రి, సీఐతో వాగ్వాదానికి దిగి బెదిరించారు. ఇదేం ధర్మం, న్యాయం? అని సీఐ కూడా వాదనకు దిగగా, జూపల్లి మండిపడ్డారు. ధర్మారంలో తన సోదరికి చెందిన స్థలం వివాదంలో ఉండగా, అవతలివారికి వీరారెడ్డి మద్దతు పలుకుతున్నారని చెప్పిన సీఐ, తాను కూడా డీజీకి జరిగిందేమిటో చెబుతానని, సూసైడ్ చేసుకుని చస్తామని అన్నారు. ఈ ఆడియో సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles