Kurnool official slaps people in Anna Canteen అన్నానికి బదులు.. బూతులు.. చెంపదెబ్బలు

Kurnool official abuses slaps people in queue in anna canteen

official abuses poor in Anna Canteen, official slaps poor in Anna Canteen, Kurnool Municipal Commissioner slapping the poor in queue at anna canteen, Municipal Commissioner abuses the poor in queue at anna canteen, Anna canteen, Official, Kurnool, Municipal Commissioner, poor, Rs 5 per meal, CCTV footage, Andhra Pradesh

Merely days after inaugural of Anna Canteen for a paltry Rs 5 per meal, a shocking CCTV footage has emerged in which the Kurnool Municipal Commissioner is seen abusing and slapping the people in queue for food at the canteen.

ITEMVIDEOS: అన్నా క్యాంటీన్లలో.. అన్నానికి బదులు.. బూతులు.. చెంపదెబ్బలు

Posted: 07/14/2018 05:21 PM IST
Kurnool official abuses slaps people in queue in anna canteen

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లలో అన్నం కొరత ఏర్పడి.. గందరగోళ పరిస్థితులకు నెలవైందన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇక దీనికి తోడు 1983లో ఈనాడు చెప్పిందే.. తాజాగా జాతీయ మీడియ చెప్పిందన్న ట్వీట్ చేసిన మంత్రి లోకేష్ ట్వీట్లు కూడా అజ్యం పోశాయేమో తెలియదు కానీ,. ఐదు రూపాయలకే అన్నం పథకం మాత్రం విమర్శలకులకు ప్రస్తుతం కేంద్రబింధువుగా మారింది.

అన్నా క్యాంటీన్లకు వందలాదిగా పేదలు వచ్చి అన్నం కోసం ఎదురుచూస్తుండగా.. అక్కడికి చేరకున్న అన్నం మాత్రం కేవలం కొందరికే సరిపోవడంతో.. ఇక అన్నం లభించలేదని అనేక మంది అన్నా క్యాంటీన్ల నుంచి ఉసూరుమంటూ కడపుకాల్చుకుని వెళ్లిపోతున్నారు. కొన్ని చోట్ల బోజన సమాయానికి ముందు టోకన్లను ఇచ్చి.. అకలి గొన్న వారిని అవస్థలకు గురిచేస్తున్నారు. అన్నం కావాలంటూ ఈ మాత్రం అవస్థలు పడాల్సిందేనని నిర్వాహకులు చెప్పడం వారిని అవేదనకు గురిచేస్తుంది.

ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకం వారం రోజులు కూడా పూర్తి కాకుండానే ఇలా విమర్శలను ఎదుర్కొవడం ఆరంభ శూరత్వమేనని పలువురు రాజకీయ విమర్శకులు అరోపిస్తున్నారు. అయితే ఇటు పోరుగు రాష్ట్రం తెలంగాణలో ఇదే పథకాన్ని అమలుపరుస్తున్న సంస్థకే ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్ల నిర్వహణను అప్పగించినా.. కొద్దిమేరకు అంచనాలు తలకిందులై ఇలా జరుగుతుందన్న వివరణలు కూడా తెరపైకి వస్తున్నాయి. అయితే అన్న కోసం అన్నమో రామచంద్ర అంటూ అన్నా క్యాంటీన్లలో అంగలార్చాల్సిన పరిస్థితి రావడం అందోళనకరమని, ఇది ప్రభుత్వ పథకం విఫలమైందన్న సంకేతాలను పంపుతుందని కూడా ప్రభుత్వం వైపు నుంచి అందోళన వ్యక్తమవుతుంది.

ఇక దీనికి తోడు అన్నం కోసం వచ్చిన పేద ప్రజలపై అన్నా క్యాంటీన్ల నిర్వహాకులు చేయి చేసుకోవడం.. వారిని అసభ్యపదజాలంతో దూషించడం కూడా ప్రభుత్వం ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుంది. రెండు నుంచి మూడు వందల మందికి మాత్రం అన్నం రావడం.. అప్పటికే అక్కడ అంతకు రెట్టింపు సంఖ్యలో పేదలు చేరుకోవడంతో అసలేం జరుగుతుందోనన్న విషయం అర్థం చేసుకునే లోపు అన్నం లభిస్తుందో లేదోనన్న అత్రుతతో పేదలు క్యూ లైన్లలోంచి ముందుకు రావడం.. నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పేదలకు అన్నం పెట్టే ఈ పథకాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బాద్యత నిర్వాహకులతో పాటు ప్రభుత్వానిదే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anna canteen  Official  Kurnool  Municipal Commissioner  poor  Rs 5 per meal  CCTV footage  Andhra Pradesh  

Other Articles