No Tirupati Balaji darshan for 9 days in August భక్తులూ.. ఆ 9రోజులు తిరుమలకు వెళ్లకండీ..

No darshan at tirumala temple for nine days in august

Tirumala Srivari temple closed in August, SriVari Darshanam, Tirumala Tirupati Devasthanam Mahasamprokshanam, Astabandhana Balalaya Mahasamprokshanam, Ttd, No Darshan, Tirumala Temple, No Darshan In August, Ttd Darshan, No Darshan In Tirumala

The Tirumala Tirupati Devasthanam (TTD) will close the Tirupati Balaji temple for five days from August 12 to 16. The devotees will not get darshan of Tirupati Balaji on the eve of Astabandhana Balalaya Mahasamprokshanam- the vedic ritual to be performed once in 12 years.

శ్రీవారి భక్తులూ.. ఆ 9రోజులు తిరుమలకు వెళ్లకండీ..

Posted: 07/14/2018 02:25 PM IST
No darshan at tirumala temple for nine days in august

మీరు శ్రీవారి భక్తులా..? ప్రతీ ఏడాది తిరుమలకు వచ్చి ఆ దేవదేవుడిని దర్శించుకుని వెళ్తుంటారా.? అయితే ఈ సారి కూడా మీ టికెట్లు ముందగానే రిజర్వు చేసుకున్నారా.? అయితే ఒక్కక్షణం ఆగండీ ఈ న్యూస్ మీ కోసమే. ప్రతిరోజు లక్ష మంది భక్తులతో పాటు అలయ అర్చకులకు, వేదపండితులకు, ప్రముఖులకు ఇలా అందరికీ అశీర్వాదాలు అందజేస్తున్న కలియుగ ప్రత్యక్ష దైవం.. శ్రీ వేంకటేశ్వరుడికి విరామాన్ని ప్రకటించారు ఆలయ పాలక మండలి సభ్యులు. అదేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు.? అంటారా.?

తిరుమల శ్రీవారి దర్శనాన్ని తొమ్మిది రోజుల పాటు ఆలయ అధికారులు నిలిపివేస్తున్నారు. తిరుమల కొండపైకి ఎవరినీ రానీయకుండా కూడా చర్యలు తీసుకోనున్నామని కమిటీ అధికారులు ప్రకటించారు. తిరుమల కొండపైకి అర్టీసీ బస్సులు కూడా రానీయమని, భక్తులు అనేక వ్యవప్రయాలకోర్చి.. తిరుపతికి చేరుకుని ఉసూరుమంటూ వెనుదిరగాల్సి రావడం.. ఇక్కడ ఇబ్బందులకు గురవ్వడం ఇష్టంలేకపోవడంతోనే తాము ఏకంగా నెల రోజుల ముందుగా ఈ సమాచారాన్ని భక్తులకు చేరవేస్తున్నామని అన్నారు. ఒక వేళ ఎవరైనా తిరుమల దర్శనానికి టికెట్లు రిజర్వు చేసుకుని వుంటే వాటిని వెంటనే రద్దు చేసుకోవడమే లేక 16 తరువాత తేదీలకు వాయిదా వేసుకోడమే మంచిదని అధికారులు స్పష్టం చేశారు.

ఎందుకిలా అంటే.. తిరుమల శ్రీవారికి ప్రతీ 12 ఏళ్లకు ఓ పర్యాయం అష్ట బంధన బాలాలయ మహా సం‍ప్రోక్షణ నిర్వహిస్తారు. 2006లో జరిగిన మహాసంప్రోక్షణ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఈ అగస్టు మాసంలో మహాసంప్రోక్షణ నిర్వహించనున్నారు. దీంతో ఆగస్టులో తొమ్మిది రోజుల పాటు భక్తులను కొండపైకి రానీయకుండా సంప్రోక్షణ కార్యక్రమాలకు విఘాతం కలగకుండా కార్యాలను పూర్తి చేయాలని తాము భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకుగాను ఆగస్టు నెల 9వ రోజు సాయంత్రం నుంచి 16వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు అలయం మూసివేస్తామని ప్రకటించారు. 11వ తేదీ నుంచి సంప్రోక్షణ కార్యాక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఇదే సమయంలో ఘాట్ రోడ్డు, నడకదారిని కూడా బంద్ చేయనున్నారు. ఆగస్టు 17 నుంచి యథావిధిగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles