Petrol and diesel prices hiked again వరుసగా తొమ్మిదవ రోజు ఎగబాకిన ఇంధన ధరలు..

Petrol price again over rs 84 per litre

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

On an upward trajectory since July 5, petrol prices in the financial capital of the country crossed the Rs 84 per litre mark on Friday and was sold at Rs 84.14 a litre.

వరుసగా తొమ్మిదవ రోజు ఎగబాకిన ఇంధన ధరలు..

Posted: 07/13/2018 05:52 PM IST
Petrol price again over rs 84 per litre

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లి పైపైకి ఎగబాకుతున్నాయి. ఇదివరకే ఆల్ టైం హై రికార్డును అందుకుని దేశవ్యాప్తంగా వాహనదారుల అగ్రహావేశాలను చవిచూసిన తరువాత క్రమంగా కిందకు జారిన ధరలు మరోమారు పెంపుదిశగా దూసుకెళ్తున్నాయి. దేశ అర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.14కు చేరింది. అదే విధంగా లీటరు డీజిల్ ధర కూడా పైపైకి ఎగబాకింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత క్రమంగా పెరిగిన ఇంధన ధరలు మే 29న ముంబైలో ఏకంగా 86.24 ధరతో అల్ టైం హైకు చేరుకుని ఆ తరువత తగ్గుముఖం పట్టింది.

ఇక తాజాగా ఈ నెల 5 నుంచి పెరుగుతూ వచ్చిన ఇంధన ధరలు మళ్లీ వాహనదారుల్ని కలవర పెడుతున్నాయి. వరుసగా తొమ్మిదివ రోజు పెరిగిన ఇంధన ధరలు మరోమారు పైకి దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ముంబైలో లీటరు పెట్రోల్ 84.14, ఢిల్లీలో 76.76, కొల్ కత్తలో 79.42, చెన్నైలో 79.67లు నమోదయ్యాయి. భయకంపితుల్ని చేస్తున్నాయి. ఇక పెట్రోల్ తో పాటు డీజిల్ ధరలు కూడా పెకి దూసుకుపోయాయి. ముంబైలో లీటరు డీజిల్  72.61 ఢిల్లీలో 68.43, కొల్ కత్తలో  70.98, చెన్నైలో రూ.72.24లుగా నమోదయ్యాయి.

రాబోయే రోజుల్లో ఇంధన ధరలు మరింత పెరుగుతాయన్న సమాచారం కూడా వాహనదారులను కలవారానికి గురిచేస్తుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న కారణంగా.. ఇంధర ధరలకు రెక్కలు వస్తున్నాయని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. ఇక దీనికి తోడు డాలర్ తో రూపాయి మారకం విలువ కూడా భారీగా పతనం కావటం కూడా ధరలు పెరగటానికి కారణంగా చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles