jabardast actor hari turns redsandels smuggler జబర్ధస్త్ అర్టిస్టు హరి అరెస్టు..

Jabardast actor hari turns to be wanted redsandels smuggler

Red Sandal Smuggler, Hari, Lady getup artist, Red Sandal, jabardast artist, jabardast actor, Jabardast, tollywood, Crime

Artist Hari who entered into the jabardast and earned name and fame turns to be a most wanted redwood sandal smuggler.

ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్ధస్త్ ఆర్టిస్టు హరి అరెస్టు..

Posted: 07/13/2018 02:23 PM IST
Jabardast actor hari turns to be wanted redsandels smuggler

తెలుగు రాష్ట్రాలలో హిట్ కామెడీ షోగా 'జబర్దస్త్' పేరు తెచ్చుకుంది. ఈ షో ద్వారా పేరుతెచ్చుకున్న పలువురు ఇప్పటికే టాలీవుడ్ సినిమాలలో నటించి మెప్పించారు. ఇక ఓ నటుడు ఏకంగా హీరోగా కూడా ఓ చిత్రం వచ్చిందంటే దానికి జబర్ధస్త్ షో ఆయనకు కల్పించిన అవకాశమే. అయితే ఈ జబర్ధస్త్ షోలలో కొందరు నటులు తమ అసలు రూపాన్ని చూపించకుండా కేవలం మహిళా గెటప్ లలో వచ్చి కూడా బాగా క్రేజ్ సంపాదించారు. అయితే తాము ఉన్నత శిఖరాలకు ఎదగాలని కొందరు ఎంతో కష్టపడుతుంటే.. ఈ నటుడు మాత్రం ఏకంగా ఓవర్ నైట్ లో సంపన్నుడు కావాలని వక్రమార్గ పట్టాడు.

తొలుత పొట్ట చేతబట్టుకొని హైదరాబాద్‌కు వచ్చాడు. ముందు టీవీ సీరియల్స్‌లో చిన్న, చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. మెల్లిగా జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఈజీ మనీ కోసం అలవాటు పడి ఎర్రచందనం స్మగ్లర్‌గా మారాడట. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో చెట్లను నరికి అక్రమంగా సరిహద్దులు దాటించేస్తున్నాడు. బెంగళూరు, చెన్నైలో ఉన్న ఇంటర్నేషనల్ స్మగ్లర్లతో సంబంధాలు పెంచుకొని.. రూ.కోట్లకు పడగలెత్తాడు. ఈ స్మగ్లింగ్‌పై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పక్కా ఆధారాలను సంపాదించిందట. అతడిపై 14కుపైగా కేసులు నమోదు చేశారట. తిరుపతిలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ తీగలాగితే.. టాలీవుడ్‌ వరకు డొంక మొత్తం కదిలిందట. ఈ కేసు మొత్తాన్ని బయటకు లాగే పనిలో ఉన్న పోలీసులు.. ఈ డాన్‌ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించింది.

తిరుపతికి చెందిన ఈ నటుడు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి కోట్లు కూడగట్టాడని, తోటి క్యారెక్టర్ ఆర్టిస్టు నటించిన ఓ చిత్రానికి డబ్బుసాయం చేశాడని కూడా సమాచారం. 'జబర్దస్త్'లో పలు స్కిట్లలో పాల్గొని, అమ్మాయి వేషంతో ఎన్నో మార్లు అలరించిన నటుడు హరి.. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. చిత్తూరు జిల్లా పోలీసులు ఇప్పుడు అతన్ని విచారిస్తున్నారు. షకలక శంకర్ నటించిన తాజా చిత్రం 'శంభో శంకర'కు అవసరమైన ఫైనాన్స్ ను కూడా హరి అందించాడట. ఇతనిపై సుమారు 20 కేసులున్నాయని, హరి నేరాలపై పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles