Fresh molestation video goes viral in Bihar మైనర్ బాలికపై లైంగికదాడి, నెట్టింట్లో వీడియో..

One more video of woman molestation from bihar nalanda went viral

molestation, Social Media, video, eve-teasing, gang-rape, Nitish Kumar, sexually assault, Janata Dal-United (JD-U), Bihar Pradesh Congress Committee, Kaukab Quadri, Nalanda, Crime

A minor girl was molested by two men, the act was filmed on camera and later made viral on the social media in Bihar's Nalanda district, triggering outrage in the state

ITEMVIDEOS: మైనర్ బాలికపై లైంగికదాడి, నెట్టింట్లో వీడియో..

Posted: 07/11/2018 04:39 PM IST
One more video of woman molestation from bihar nalanda went viral

ఉత్తర్ ప్రదేశ్ లోని ఉన్నావ్ లో ఓ యువతి పట్ల నలుగురు యువకులు సామూహిక అత్యాచారయత్నం చేయగా.. ప్రాణాలను చేతిలో పట్టుకుని వారిని అర్థించి.. అన్నా అంటూ పిలిచి చివరకు వారి చెర నుంచి తప్పించుకోగా, వారిని ఆ ఆకృత్యాన్ని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగానే అది కాస్తా వైరల్ అయ్యి అగంతకులను కటకటాలు లెక్కించేట్లు చేసిన ఘటనను మర్చిపోకముందే.. తాజాగా బిహార్ లో కూడా అలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది.

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత జిల్లా అయిన నలందాలో సాక్ష్యాత్తు అధికార పార్టీకి చెందిన వ్యక్తులే ఆకృత్యాలకు తెరలేపారు. నలంద జిల్లా ఉస్మాన్ పూర్ కు చెందిన మైనర్ బాలికపై ఆకతాయిలు  లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తానని వెళ్లిన అమ్మాయి.. వారింట్లోకి వెళ్లగానే అక్కడ స్నేహితురాలికి బదులు అధికార పార్టీ నేతల కుమారులు వుండటం.. వారు అమెను బలవంతంగా వారి మధ్యలో కూర్చోబెట్టుకుని తాకరాని చోటల్లా తడిమారు. బాలిక తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినా ఆ మగమృగాల బలం ముందు ఓడిపోక తప్పలేదు.

అయితే ఇంతటితో అగని ఆ పైశాచిక మృగాలు ఈ మొత్తం ఘటనను తమ సెల్ ఫోన్లో బంధించాయి. ఈ నెల 9న ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వారి అకృత్యాలు బయటపడ్డాయి. అప్పటివరకు సర్పంచ్ కుమారుడంటూ కాస్తా సంశయించిన బాధిత బాలిక తల్లిదండ్రులు వీడియో కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారడంతో పోలీసులకు పిర్యాదు చేశారు. వీడియో ఆధారంగా ప్రధాన నిందితుడైన ఓ గ్రామ సర్పంచ్ కుమారుడిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

నిందితులపై పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నలంద ఎస్పీ సుధీర్ కుమార్ వెల్లడించారు. జూన్ 24న కైమూర్ జిల్లాలో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన మరో ఘటన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిడంతో..ఆ నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. కాగా తాము అధికార పార్టీకి చెందిన వారమన్న అహంభావంతో.. తమపై పోలీసులు కేసులు నమోదు చేయరన్న ధైర్యంతోనే పార్టీ నేతల కుమారులు అకృత్యాలకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : molestation  Social Media  video  gang-rape  Nitish Kumar  sexually assault  Bihar  Nalanda  Crime  

Other Articles

 • Scr introduces magic box to make train journey a thrill

  రైలు ప్రయాణం.. మ్యాజిక్ బాక్స్ తో వినోదాత్మకం..

  Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌... Read more

 • Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

  ‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

  Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more

 • Bjp operation lotus yeddurappa caught again in audio tapes

  ‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

  Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more

 • 12 crpf jawans killed many injured in jk terror attack

  పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

  Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more

 • Sensational twist in coastal bank director chigurupati jayaram case

  జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

  Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more

Today on Telugu Wishesh