Swami Paripoornananda also externed from Hyderabad స్వామి పరిపూర్ణానందపై కూడా నగరం బహిష్కరణ వేటు

Swami paripoornananda also externed from hyderabad

sri peetam, swami paripoornananda, kathi mahesh, sri rama, prevention of anti social and hazardous activities act, Darmika Chaitanya Yatra, dharmagraha yatra, yadadri, derogatory remarks, latest hyderabad news, latest hyderabad updates, hyderabad police, telangana

Two days after externing film critic Kathi Mahesh from the city for six months for making offensive statements against Lord Rama, the City Police externed Sri Peetam Swami Paripoornananda for making provocative statements during various meetings in the State.

స్వామి పరిపూర్ణానందపై కూడా నగరం బహిష్కరణ వేటు

Posted: 07/11/2018 10:07 AM IST
Swami paripoornananda also externed from hyderabad

సినీవిమర్శకుడు కత్తి మహేష్ పై రెండు రోజుల క్రితం నగరం బహిష్కరణ విధించిన హైదరాబాద్ పోలీసులు తాజాగా శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై కూడా నగర బహిష్కరణ విధించారు. ఈయన కూడా ఆరు నెలల పాటు నగరంలోకి అడుగుపెట్టరాదని షరుతు విధించారు. ఒక వేళ పోలీసులు అంక్షలను అధిగమించిన పక్షంలో పరిపూర్ణానంద స్వామీకి కూడా మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశాలు వున్నాయని పోలీసులు తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత నగర బహిష్కరణ వేటు పడిన తొలి వ్యక్తి కత్తి మహేష్ కాగా, రెండో వ్యక్తిగా స్వామీజీ నిలిచారు.

శ్రీరాముడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా చేశారంటూ కత్తి మహేశ్‌పై పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేశ్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ బౌడుప్పల్ నుంచి యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పాటు ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. రెండ్రోజుల నుంచి ఆయన బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల చర్యను హిందూ ధార్మిక సంఘాలతో పాటు బీజేపి తీవ్రంగా ఖండించింది.  

కాగా, స్వామి పరిపూర్ణానంద గతేడాది నవంబర్ లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే బహిష్కరణ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో స్వామిని హైదరాబాద్‌ నగరం నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. ఈ మేరకు క్రితం రోజున స్వామీజీకి ముందుగా నోటీసులు అందించిన పోలీసులు ఇవాళ తెల్లవారు జామును మూడున్నర గంటల సమయంలో ఆయనను గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles