telangana intelligence enquires about swapna reddy స్వప్నారెడ్డిపై అరా తీసిన తెలంగాణ ఇంటెలిజెన్స్

Hc orders on quota in pr polls telangana cm names swapna reddy

swapna reddy, Chief Minister, K. Chandrashekhar Rao, KCR, congress, petition, High court, supreme court, panchayat raj polls, Telangana, politics

Telangana Chief Minister K. Chandrashekhar Rao criticized that the Congress party filed the petition through its party sarpanch Swapna Reddy opposing the 34% reservation for backward classes and thus obstructing reservation for them.

కేసీఆర్ నోట స్వప్నారెడ్డి పేరు.. అరా తీసిన ఇంటెలిజెన్స్..

Posted: 07/11/2018 09:27 AM IST
Hc orders on quota in pr polls telangana cm names swapna reddy

గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలను తాము అపుతున్నామని, ఇక తెలంగాన కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకమని అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అందోల్‌ మండలం పోసాని పేట గ్రామ సర్పంచ్‌ స్వప్నారెడ్డి స్పష్టం చేశారు. వాస్తవానికి రాష్ట్రంలోనే కాదు ఏకంగా దేశంలోనూ బిసీలకు ఎంతో మేలు చేకూర్చింది కాంగ్రెస్ పార్టీయేనని అమె పేర్కోన్నారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు లోబడే రిజర్వేషన్లు వుండాలని మాత్రమే తాము పిటీషన్ దాఖలు చేశామని అమె అన్నారు.

వాస్తవానికి రాష్ట్రంలోని అధికార టీఆర్ఎస్ పార్టీకి పంచాయితీరాజ్ ఎన్నికలను జరిపించాలన్న ఉద్దేశం లేదని.. అందుకనే అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉల్లంఘించి మరీ ఎన్నికలల్లో రిజర్వేషన్లు  కల్పించిందని అమె అరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడంది కాక.. వాటిపై ఎవరైనా కోర్టుకు వెళ్తారన్న అలోచన వుండే ఇలాంటి నిర్ణయం తీసుకుందని అమె అరోపించారు. సర్వోన్నత న్యాయస్థానం అన్ని రిజర్వేషన్లు కలపి ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించకుండా చూసుకోవాలని అదేశాలను గతంలో జారీ చేసిందని అమె అన్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, అత్యున్నత న్యాయస్థానం రూలింగ్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. రిజర్వేషన్ల కేటాయింపు 50 శాతానికి మించి ఉండకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి అదేశాలను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అమె అన్నారు. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన కేసీఆర్, సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు చెప్పారు. ఇందుకు కారణం కూడా స్వప్పా రెడ్డి అని ఆయన ఒక కాంగ్రెస్ సర్పంచ్ పేరును లేవనెత్తడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైకోర్టు తీర్పుకు స్వప్నారెడ్డి కారణమని కేసీఆర్ చెప్పగా, ఆమె ఎవరా అని పలువురు చర్చించుకోవడం మొదలుపెట్టారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆమె గురించిన వివరాలు తెప్పించుకుని ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles