Godrej refuses to cede prime land for bullet train project బుల్లెట్ రైలు బాలారిష్టాలకు తోడైన గోద్రెజ్

Godrej refuses to cede prime land for bullet train project

bullet train, bullet train project, Godrej group, land acquisition, Maharashtra, Bombay high court, Adi Godrej, Modi, Modi government, Narendra Modi, National Highways, Palghar protests, train infrastructure, Vikkhroli land

The Godrej Group, company is opposing a notice issued earlier this year for acquisition of land to the west of the Eastern Express Highway. The cost of the land, say experts, could be Rs 200 crore, and its development potential worth much more.

బుల్లెట్ రైలు బాలారిష్టాలకు తోడైన గోద్రెజ్

Posted: 07/10/2018 02:44 PM IST
Godrej refuses to cede prime land for bullet train project

ప్రధాని నరేంద్రమోదీ మానస పుత్రికగా పేరొందిన బుల్లెట్ రైలుకు బాలారిష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రకటించి నెలలు కావస్తున్నా.. ఇంకా అవరోధాలు, అడ్డుంకులు మాత్రం తొలగిపోకపోవడంతో ప్రాజెక్టు అధికారులకు శరాగాతంలా పరిణమించాయి. ‌‌బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్రకు చెందిన రైతులు, గిరిజన సంస్థల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రాజెక్టు పేరుతో భూ సమీకరణ చేయడాన్ని సవాలు చేస్తూ గుజరాత్ కు చెందిన రైతులు కోర్టును ఆశ్రయించారు.

కాగా తాజాగా, ముంబై పట్టణంలోనే అత్యంత అధికంగా భూమి కలిగిన సంస్థగా పేరొందిన గోద్రెజ్ కంపెనీ కూడా బుల్లెట్ రైలు ప్రాజెక్టు అలైన్ మెంటుకు మోకాలడ్డుతోంది. అహ్మదాబాద్-ముంబై మధ్య చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో గోద్రెజ్ సంస్థకు కూడా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సివస్తుంది. ప్రాజెక్టులో భాగంగా ముంబై శివారులోని విఖ్రోలిలో ఉన్న గోద్రెజ్ కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన ఆ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

ప్రభుత్వ ప్రతిపాదన కారణంగా తమకు ఎంతో కీలకమైన 8.6 ఎకరాలు కోల్పోవాల్సి వస్తుందని పిటిషన్‌లో పేర్కొంది. కాబట్టి ప్రాజెక్టు అలైన్మెంట్ మార్చాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ నెల 31న ఇది విచారణకు రానుంది. దీంతో ప్రాజెక్టు అలైన్మెంట్ అధికారులు కూడా ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నారని సమాచారం. ఇక కేంద్ర ప్రభుత్వం ఎటవంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కాగా, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో భాగంగా ముంబై-అహ్మదాబాద్ మధ్య 508.17 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles