Amitabh Bachchan family pictures goes viral బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీ ఫోటో వైరల్..

Amitabh bachchan shares candid pictures family from their holiday

amitabh bachchan, amitabh bachchan latest news, abhishek bachchan, navya naveli nanda, amitabh bachchan family, amitabh bachchan latest news, amitabh bachchan upcoming films, Bollywood, movies, entertainment

Amitabh Bachchan despite his hectic schedule, the megastar makes sure to spend quality time with his loved ones. He also keeps his fans and followers updated by sharing pictures from his precious family time.

బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీ ఫోటో వైరల్..

Posted: 07/10/2018 12:32 PM IST
Amitabh bachchan shares candid pictures family from their holiday

బిగ్ బి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానులతో నిత్యం తన సోషల్ మీడియా ద్వారా అందుబాటులో వుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో అనవసర విషయాలను ప్రాథాన్యం ఇవ్వడం అసలు ఇష్టంలేని అమితాబ్.. ఆ మధ్య ముంబైలో తన మిత్రుడి అంత్యక్రియలకు హాజరుకాగా, అక్కడ కూడా అభిమానులు విషాదవాతవరణాన్ని కాదని, ఫోటోలకు, సెల్పీలను కోరడంతో ఆయన అవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

తాజాగా సెల్ ఫోన్లు, సోషల్ మీడియా ఎలాంటి ప్రభావాన్ని చాటుతుందో అని చెప్పడానికి ఆయన తన ఇంటిసభ్యుల ఫోటోనే ఒకటి ఫొటో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రా‌మ్ లో షేర్ చేశారు. అది కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారడంతో పాటు అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుత సమాజంలో కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయన్న విషయానికి ఇది అద్దం పడుతోంది. అందరి చేతా ‘ఔరా’ అనిపించే ఈ ఫొటోకు ఇప్పటికే లక్షలాది లైకులు వచ్చాయి.

అమితాబ్ షేర్ చేసిన ఫొటోలో ఆయన కుటుంబం అంటే.. చిన్నారులు శ్వేతా బచ్చన్ నందా, అభిషేక్ బచ్చన్, మనవళ్లు నవ్యా నావెలి నందా, అగస్త్య తదితరులు ఉన్నారు. ఇందులో విశేషం ఏంటని అంటారా.. అందరూ ఒకే హాల్‌లో ఒకరికి ఒకరు అందేంత దూరంలో కూర్చున్నా.. రూములో అంతమంది ఉన్నా ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. కారణం.. ప్రతీ ఒక్కరి చేతుల్లోనూ మొబైల్ ఉంది. అందరూ అందులోనే మునిగిపోయారు. తదేక దీక్షతో ‌మొబైల్ ను ఆపరేట్ చేస్తూ ప్రపంచాన్ని మైమరచిపోయారు. దీంతో ‘‘అందరూ ఒక చోటే ఉన్నారు. వారితో ఫోన్లు కూడా ఉన్నాయి’’ అంటూ అమితాబ్ తన ఫొటోకు క్యాప్షన్ రాశారు. ఈ ఫోటోలో అందరూ స్మార్ట్ ఫోన్ లో మునిగిపోతే ఒక్క నవ్య ఒక్కర్తే పుస్తకం చదువుతూ కూర్చోవడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachchan  big b family  instagram  mobiles  vocation  bollywood  

Other Articles

 • Scr introduces magic box to make train journey a thrill

  రైలు ప్రయాణం.. మ్యాజిక్ బాక్స్ తో వినోదాత్మకం..

  Feb 14 | సుదూర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో కాస్త అటవిడుపు, ఆహ్లాదాన్ని పంచే పరిస్థితులు ఉండాలని ప్రయాణికులు కోరుకుంటారు. ముఖ్యంగా రైలు  ప్రయాణంలో ఇది అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ‘మ్యూజిక్‌... Read more

 • Pawan kalyan inaugurates sri vasavi kanyaka parameshwari idol

  ‘‘థర్మం దారితప్పితే.. కన్యకా పరమేశ్వరే మార్గదర్శకం..’’

  Feb 14 | జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెనుగొండ ఊరు పేరుని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ’గా మారుస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవి... Read more

 • Bjp operation lotus yeddurappa caught again in audio tapes

  ‘‘కర్ణాటకలో ప్రలోభాల పర్వం.. కాదేదీ రాజకీయ అనర్హం’’

  Feb 14 | కర్ణాటకలో బీజేపి అగ్రనేతలపై అధిష్టానం కత్తి పెట్టిందా.? ఎలాగైనా రాష్ట్రంలోని కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టి.. బీజేపి ప్రభుత్వాన్ని నెలకొల్పాన్న వాంఛతో వుందా.? అందుకనే అక్కడ జరుగుతున్న బేరసారాలు, ప్రలోభాలు వెలుగులోకి వస్తున్నా.. వాటిపై కిమ్మనకుండా... Read more

 • 12 crpf jawans killed many injured in jk terror attack

  పేట్రేగిపోయిన ముష్కరులు.. 12 మంది జవాన్ల మృతి.. కాశ్మీర్లో బీభత్సం..

  Feb 14 | జమ్మూకశ్మీర్లో ఉగ్రవాద ముష్కరులు పేట్రేగిపోయారు. నెత్తుటేరులు పారించారు. సరిహద్దు ప్రాంతంతో పాటుగా జమ్మూకాశ్మీర్ లో శాంతిభద్రలే లక్ష్యంగా గస్తీ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మరోసారి పిరికిపంద చర్యకు ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో అవంతీపుర... Read more

 • Sensational twist in coastal bank director chigurupati jayaram case

  జయరాం హత్యకేసులో సంచలన ట్విస్టు

  Feb 14 | తెలుగురాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్ర వ్యాపారవేత్త, కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు మరో మలుపు తిరిగింది. జయరాం సతీమణి పద్మశ్రీ తన భర్తకు ఎలాంటి అర్థికఇబ్బందులు లేవని, తాను... Read more

Today on Telugu Wishesh