JNTU Professor attacks security guard, video goes viral సెక్యూరిటీ గార్డుపై జేఎన్టీయూ ప్రోఫెసర్ దాడి..

Jntuh professor assaults guard video goes viral

jntu, kukatpally, assistant professor, venkateshwara rao, kasiram, secirity guard, car parking, no-parking area, Saibaba Reddy, Hyderabad, viral video

In a shocking incident, A professor of JNTUH College of Engineering attacked a security guard after the his son was refused from parking the car in the no-parking area.

ITEMVIDEOS: సెక్యూరిటీ గార్డుపై జేఎన్టీయూ ప్రోఫెసర్ దాడి.. నెట్టింట్లో వీడియో వైరల్

Posted: 07/10/2018 09:53 AM IST
Jntuh professor assaults guard video goes viral

ప్రొఫెసర్ సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన ఘటన కూకట్ పల్లి జేఎన్టీయూలో చోటుచేసుకోగా, ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారింది. ఉన్నత విద్యావంతుడైన ఆయన తన విఛక్షణ కోల్పోయి కేవలం తాను ప్రోఫెసర్ అన్న అహంభావంతో ఓ సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తన కొడుకుకు అవమానం జరిగిందన్న బాధను భరించలేని ఆ తండ్రి సెక్యూరిటీ గార్డుపై అకారణంగా దాడి చేయడమేంటన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులతో పాటూ సమాజంలో నలుగురికి మంచి చెడు చెప్పాల్సిన ప్రోఫెసర్ తన కొడుకు చేసిన తప్పుడు పనిని సమర్థించడం ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తప్పుడు పనులను సరి చేసే ప్రయత్నం చేసిన సెక్యూరిటీ గార్డుపై దాడికి పాల్పడటం జేఎన్టీయూ సహా విద్యా సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. చుట్టూ నలుగురు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేకుండా ప్రవర్తించాడు. సెక్యూరిటీ గార్డు క్షమించండని దండం పెడుతున్నా వినిపించుకోకుండా పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా అతనిపై తన ప్రతాపాన్ని చూపించాడు. దుర్భాషలాడుతూ పిడి గుద్దులు కురిపిస్తూ దాడి చేశాడు. అయితే ప్రోఫెసర్ వెంకటేశ్వర రావు సెక్యూరిటీపై దాడి చేసిన పూర్తి ఘటన స్థానికంగా వున్న సీసీ కెమెరాలకు చిక్కింది. ఆ వీడియో సోషల్ మీడియాలోకి చేరడంతో.. అయ్యగారి ఘనకార్యం బయటపడింది.

ఎస్ వెంకటేశ్వరరావు.. కూకట్ పల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్. రెండు రోజుల క్రితం అతడి కుమారుడు కారు తీసుకెళ్లి స్పందన బ్లాక్ ఎదురుగా పార్క్ చేశాడు. కారును గమనించిన సెక్యూరిటీ గార్డ్ కాశీరామ్.. ఇది పార్కింగ్ స్థలం కాదని కారు తీయాలని చెప్పాడు. వెంటనే అతడు జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. వెంటనే ఆవేశంతో ఊగిపోయిన వెంకటేశ్వరరావు.. కాశీరామ్‌ను ఓ రూమ్‌లోకి లాక్కొచ్చాడు.

వచ్చీరాగనే ప్రొఫెసర్ సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. పిడి గుద్దులు కురిపంచాడు. క్షమించమని బతిమాలినా వదల్లేదు. చుట్టూ ఉన్న వాళ్లు అతడ్ని ఆపే ప్రయత్నం చేసినా ఊరుకోలేదు. అతడ్ని లాక్కొచ్చి మరీ చితకబాదాడు. తన కాలికి ఉన్న షూ తీసి కొట్టబోయాడు. తన కొడుకును పిలిపించి కాళ్లు మీద పడి క్షమించాలని కోరమన్నాడు. దీంతో ఏమీ చేయలేక కాశీరామ్ ప్రొఫెసర్ కొడుకు కాళ్ల మీద పడ్డాడు. అప్పుడు కాని వెంకటేశ్వరరావు శాంతించలేదు.

దాడి విషయం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ దృష్టికి వెళ్లింది. బాధితుడి నుంచి ఫిర్యాదు తీసుకొని.. ఘటనపై విచారణ జరుపుతామంటున్నారు ప్రిన్సిపల్. తప్పు ఎవరిదో తేలితే చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రొఫెసర్ గార్డ్‌పై దాడి చేస్తున్న సీన్ మొత్తం దగ్గర్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అయ్యగారి ఘనకార్యానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఆయన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. కారణం లేకుండానే ఇలా చేయడం దారుణమని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు కూడా డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jntu  assistant professor  venkateshwara rao  kasiram  secirity guard  car parking  Hyderabad  viral video  

Other Articles

Today on Telugu Wishesh