Nirbhaya case: SC upholds death penalty నిర్భయ కేసు: ‘‘ఆ నలుగురికి ఉరే శిక్ష’’

Sc dismisses review pleas of three convicts in nirbhaya gangrape case

Nirbhaya Rape Case, Nirbhaya Gang-Rape Case, Nirbhaya Rape Case Verdict LIVE, Chief Justice Dipak Misra, Justice R Banumathi, Justice Ashok Bhushan, nirbhaya, justice Nirbhaya, supreme court, latest news Nirbhaya, nirbhaya gang rape case, 2012 Delhi gang rape, latest news nirbhaya, nirbhaya boyfriend photo, nirbhaya photos in hospital, Nirbhaya Case live updates, nirbhaya photo

The SC bench comprising Chief Justice Dipak Misra, Justices R Banumathi and Ashok Bhushan pronounced its judgment on the death penalty pleas of convicts by rejecting the review petitions and upholding apex court judgement

నిర్భయ కేసు: ‘‘ఆ నలుగురికి ఉరే శిక్ష’’

Posted: 07/09/2018 03:24 PM IST
Sc dismisses review pleas of three convicts in nirbhaya gangrape case

నిర్భయ రేప్ కేసులోని దోషులకు ఉరిశిక్షే సరైందని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. దారుణమైన నేరాలకు పాల్పడిన నిందితులకు వీరికి విధించే మరణశిక్షను ఒక సందేశంగా వెళ్లాలని సూచిస్తూ.. కింది కోర్టులో విధించిన శిక్షలను సమర్థిస్తూ మరణశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సామూహిక అత్యాచారం, హత్య ఘటనలో దోషులకు శిక్ష తగ్గించే ప్రసక్తే లేదని భారత సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

గతంలో మరణశిక్ష విధించిన ముగ్గురు ముద్దాయిలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వారికి ఉరి శిక్షే సరైందని స్పష్టం చేసింది. దోషులైన నలుగురు నిందితులు ముఖేష్ (29), పవన్ గుప్తా (22), వినయ్ శర్మ (23), అక్షయ్ కుమార్ సింగ్ (31)లకు గత ఏడాది మే 5న కేసును విచారించిన న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధించింది. దీంతో దోషులలో అక్షయ్ కుమార్ సింగ్ మినహా మిగిలిన ముగ్గురు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ లు తమపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులు వేసిన శిక్షలను తగ్గించాలని రివ్యూ పిటీషన్ల దాఖలు చేశారు.


దీంతో ఈ పిటీషన్లను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి దిపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ముగ్గురు దోషులు వేసిన రివ్యూ పిటీషన్లను తిరస్కరించింది. కింది కోర్టులు వెలువరించిన తీర్పులనే సమర్థిస్తూ.. మరణశిక్షను ఖరారు చేస్తై తుది తీర్పు వెల్లడించింది. దారుణమైన నేరానికి పాల్పడిన దోషులకు ఉరిశిక్షే సరైందని తేల్చింది. క్యురెటివ్‌ పిటిషన్‌ వేసేందుకు వారికి అవకాశం కల్పించింది.

2012 డిసెంబరు 16న దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో తోటి విద్యార్థితో కలిసి బస్సులో వెళ్తున్న ఓ పారామెడికల్‌ విద్యార్థిపై ఆరుగురు వ్యక్తులు అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన యావత్ దేశాన్నే కాకుండా ప్రపంచాన్నే కలిచివేసిన విషయం తెలిసిందే. అఘాయిత్యం చేయడమే కాకుండా ఆ యువతి లైంగిక అవయవాలు ఇనుప రాడ్డు జొప్పించి దోషులు రాక్షసానందం పొందారు. అనంతరం బస్సులోంచి రోడ్డు మీదకు తోసేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు సింగపూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబరు 29 ప్రాణాలు విడిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nirbhaya Case  supreme court  CJ Dipak Misra  Mukesh  Pawan Gupta  Vinay Sharma  Akshay Singh  death penalty  

Other Articles

 • Multiplexes theaters to allow outside food in telangana

  సర్కార్ సంచలన నిర్ణయం.. మల్టీప్లెక్సులో బయటి అహారం..

  Jul 19 | తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయాలు పడిన నేపథ్యంలో ఎవరైనా తమ ప్రభుత్వంపై కూడా న్యాయస్థానాన్ని అశ్రయిస్తే.. అక్కడి వెళ్లిన తరువాత పరిస్థితిని చూసుకుందామన్న భావనను రానీయకుండా.. ముందుగానే అలర్గ్ అయ్యింది.... Read more

 • Lok sabha passes bill to scrap no detention policy in schools

  విద్యార్థులూ.. జాగ్రత్తా.! మళ్లీ ఫెయిల్ విధానం అమల్లోకి..

  Jul 19 | భారత దేశంలో అన్ని రంగాల్లో తమ ఉనికి వుండేలా చర్యలు తీసుకుంటున్న కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం.. స్వాతంత్ర్యం ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతున్న కరెన్సీ నోట్లను కూడా మార్చి.. ఇక కరెన్సీ వాడిన... Read more

 • Jet airways offers up to 30 discount on domestic international flight tickets in new sale

  జెట్ ఎయిర్ వేస్ విమాన టికెట్లపై భారీ రాయితీ

  Jul 19 | చౌకధర విమానయానం కల్పించే సంస్థ జెట్ ఎయిర్ వేస్ తాజాగా విమాన ప్రయాణికులకు మంచి ఆఫర్ ప్రకటించింది. తమ విమానాల్లో ప్రయాణించనున్న కస్టమర్లకు దేశీయంగా, అంతర్జాతీయంగా రాయితీని ప్రకటించింది. జెట్ ఎయిర్ వేస్ దేశీయ,... Read more

 • Congress to attack center raise issues that are difficult to counter during no confidence motion

  మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై దిక్కులు పిక్కటిల్లాలి: సోనియా

  Jul 19 | కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాసంపై శుక్రవారం లోక్ సభలో చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టడానికి తమకు తగిన సంఖ్యాబలం... Read more

 • Ys jagan draws huge crowds in kakinada

  జగన్ సభకు అసంఖ్యాక జనం.. కాకినాడ అదుర్స్..

  Jul 19 | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 200 రోజులకు పైగా కొనసాగిస్తున్న అత్యంత ప్రజాదరణను కూడా కూడగట్టుకుంటుంది. ఈ క్రమంలో క్రితం రోజున... Read more

Today on Telugu Wishesh