We too are ready for early polls: TPCC సవాల్ స్వీకరించిన కాంగ్రెస్.. మేమూ సిద్దమే.. అంటూ బదులు

Cong ready for early polls avers tpcc chief uttam kumar reddy

congress, TRS, BJP, Uttam kumar reddy, early polls, early elections, kcr, danam nagender, telangana, politics

Telangana Pradesh Congress Committee (TPCC) President Uttam Kumar Reddy said that the party is fully prepared to pull down the corrupt regime in the state.

సవాల్ స్వీకరించిన కాంగ్రెస్.. మేమూ సిద్దమే.. అంటూ బదులు

Posted: 06/25/2018 03:26 PM IST
Cong ready for early polls avers tpcc chief uttam kumar reddy

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సిద్దమేనా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విపక్షాలకు సవాల్ విసిరిన క్రమంలో వారు కూడా అదేస్థాయిలో స్పందించారు. మరీముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను కేసీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నానని ట్వీట్ చేశారు. తాము కూడా ఎన్నికలకు సిద్దమని, ఎఫ్పుడోచ్చినా. అది మే 2019లో అయినా లేక డిసెంబర్ 2018లోనైనా తాము సిద్దమని స్పష్టం చేశారు.

ప్రతిపక్షం పదే పదే తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేయకుండా ఎలక్షన్స్ కు పోదామా? మీ సంగతి మా సంగతి ప్రజలు తేలుస్తరని కేసీఆర్ సవాల్ చేసిన నేపథ్యంలో మరో అడుగుముందుకేసిన ఉత్తమ్.. ముందస్తు ఎన్నికలు తెలంగాణ ప్రజలకు శుభవార్తలాంటిదన్నారు. కేసీఆర్ పాలనను కొన్ని నెలలు ముందే వదిలించుకోవచ్చునని ప్రజలు భావిస్తున్నారన్నారు. అవినీతి, నిరంకుశ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి పూర్తిస్థాయిలో తమ పార్టీ సన్నద్ధంగా ఉన్నదని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీలో దానం నాగేందర్ చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నేతలను మరోమారు దద్దమల్లు అంటూ విమర్శించిన నేపథ్యంలోనూ పలువురు కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ చవటలు, దద్దమ్మలు అంటూ విమర్శించే సీఎం.. మరీ మా పార్టీ నేతలను తమ పార్టీలోకి ఎందుకు అహ్వానిస్తున్నారని ప్రశ్నించారు. ఇక్కడుంటే చవటలు, దద్దమ్మలు అక్కడికెళ్తే.. ఎలా పునీతులవుతున్నారని నిలదీస్తున్నారు. ఇక సీఎం ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు, విమర్శలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : congress  TRS  BJP  Uttam kumar reddy  early polls  early elections  kcr  danam nagender  telangana  politics  

Other Articles