17 out of 31 districts of Telangana approved తెలంగాణ సర్కారుకు కేంద్రం షాక్.. జిల్లాలను కుదించాల్సిందేనా..?

Union home ministry approves 17 districts in telangana

Union Home Ministry, Telangana Government, Telangana Government news, Telangana Government updates, Telangana Government latest, Telangana Government next, Telangana districts, Telangana latest updates, Telangana, new districts, union government, approves, 17 districts, state government, shock, politics

Telangana Government requested for 31 districts in the newly formed state, the Union Home Ministry approved 17 districts which left the state government in shock.

తెలంగాణ సర్కారుకు కేంద్రం షాక్.. జిల్లాలను కుదించాల్సిందేనా..?

Posted: 06/25/2018 11:54 AM IST
Union home ministry approves 17 districts in telangana

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో అనేక వివాదాలకు కేంద్రబింధువుగా మారిని జిల్లాల పునర్విభజన అంశం మళ్లీ మెదటికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర అవిర్భావ సమయంలో వున్న 10 జిల్లాలను పునర్విభజన చేసి.. 31 జిల్లాలుగా రూపోందించిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని విషయంలో కొద్దిగా చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందా.? అంటే అవుననే సందేహాలే వస్తున్నాయి. ఇందుకు మూలకారణం.. తెలంగాణ సర్కారు పంపిన జిల్లాలను కేంద్రం అర్థభాగం మేర మాత్రమే అమోదించింది. మొత్తంగా 31 జిల్లాలలో కేవలం 17 జిల్లాలను మాత్రమే కేంద్రం అమోదించింది.

గతంలో ప్రకటించిన డీఎస్పీ, సహా పలు ఉద్యోగ ప్రకటనలకు ఈ అంశం ముడిపడి వుండటం.. ఇప్పటికే కేంద్రం ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి మొట్టికాయ వేసిన నేపథ్యంలో జిల్లాల పునర్విభజనపై కేంద్రం చేత ముద్ర వేయించి అటు పిమ్మట రాష్ట్రపతితో కూడా రాజముద్ర వేయించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అశలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నీళ్లు చల్లింది. రాష్ట్రంలో లోకసభ స్థానాలు 17 వున్న నేపథ్యంలో కేవలం 17 జిల్లాలను మాత్రమే అమోదిస్తామని, అంతకుమించి అమోదించలేమని స్పష్టం చేసింది.

రాష్ట్ర విభజన తరువాత వున్న అప్పటి 10 జిల్లాలు.. ఆదిలాబాద్,  హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గోండ, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ లకు అదనంగా మరో ఏఢు జిల్లాలను కేంద్ర ప్రభుత్వం అధికారికింగా అమోదించింది. అవి మంచిర్యాల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, నగర్ కర్నూల్ జిల్లాలు. దీంతో 2016 తరువాత జిల్లాలుగా ఏర్పడిన మరో 14 జిల్లాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ 14 జిల్లాలను అమోదం పొందిన 17 జిల్లాల్లో విలీనం చేయాలని అదేశించింది.

ఇప్పటికే జిల్లా హోదాను పోంది గత ఏఢాదిన్నరగా పాలన సాగిస్తున్న జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కుమరంభీమ్ అసిఫాబాద్, మహబూబాబాద్, మేడ్చల్, నిర్మల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, స్యూరాపెట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ అర్భన్ జిల్లాలను ఎటు విలీనం చేస్తారన్న అంశం మళ్లీ తెలంగాణవాసులను కలవరానికి గురిచేస్తుంది. కాగా ఇక జిల్లాల పునర్విభజనతో ఉద్యోగ జోన్లును కూడా రమారమి ఖారారు చేసిన తెలంగాణ సర్కారు మళ్లీ మొత్తం ప్రక్రియను చేపట్టాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  new districts  union government  approves  17 districts  state government  shock  politics  

Other Articles