TN Governer warns MK Stalin of jail ‘‘నన్ను అడ్డుకుంటే జైలు, జరిమానా తప్పదు’’

Tamil nadu governor enjoys unhindered freedom raj bhavan on dmk stir

Banwarilal Purohit, Governor, oppostion parties, mk stalin, protest over governors district trips, West bengal, Ministry, constitution, tamil nadu, politics

Tamil Nadu Raj Bhavan has threatened “imprisonment” of those preventing the governor from exercising his powers vested under the Constitution.

‘‘నన్ను అడ్డుకుంటే జైలు, జరిమానా తప్పదు’’

Posted: 06/25/2018 10:35 AM IST
Tamil nadu governor enjoys unhindered freedom raj bhavan on dmk stir

తమిళనాడులోని అధికారపక్షం పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్న గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ విపక్షాలకు హెచ్చరిక సందేశాలను పంపారు. రాజ్యంగం గవర్నర్లకు కల్పించిన పలు విశేషాధికారాల నేపథ్యంలో తన రాష్ట్ర పర్యటనలు కొనసాగుతాయని, ఈ క్రమంలో  తన పర్యటనలను అడ్డుకుంటామన్న విపక్ష నేతలకు  స్ట్రాంగ్ వార్నింగ్ పంపించారు. ప్రభుత్వ విభాగాలను సమీక్షించడం తన విధి అని, తన పర్యటనల్లో నిరసనలు తెలిపినా, అడ్డుకునేందుకు ప్రయత్నించినా జైలుకు వెళ్లాల్సి వుంటుందని హెచ్చరించారు.

రాజ్యాంగపరంగా గవర్నర్ కు కొన్ని విశేషాధికారాలు ఉంటాయని, వాటిని ఎవరూ అడ్డుకోకూడదని రాజ్ భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీసీ సెక్షన్ 124 కింద గవర్నర్ కు రక్షణ లభిస్తుందని, ఆయన్ను అడ్డుకునేందుకు చూస్తే, ఏడేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని పేర్కొంది. తన పర్యటనలను అడ్డుకుంటామని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు ఇప్పటికే తేల్చిచెప్పిన నేపథ్యంలో రాజ్ భవన్ కార్యాలయం స్పందిస్తూ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరికలను జారీ చేసింది.

కాగా, రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పందిస్తూ, ఆయన రాష్ట్ర గవర్నర్ గా కాకుండా పరిపూర్ణ రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపుతానని బెదిరించడాన్ని ఖండించారు. గవర్నర్ స్వయంగా వెళ్లి ప్రభుత్వ విభాగాలను తనిఖీ చేయడమంటే, సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టేనని, గవర్నర్ పర్యటనల్లో నల్ల జెండాలతో నిరసనలు కొనసాగిస్తామని స్టాలిన్ స్పష్టం చేశారు. కాగా, శుక్రవారం నాడు గవర్నర్ నామక్కల్ లో పర్యటించగా, డీఎంకే శ్రేణులు నిరసనలు తెలిపిన వేళ, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Banwarilal Purohit  Governor  oppostion parties  mk stalin  constitution  tamil nadu  politics  

Other Articles