Kerala woman, lover jailed for husband's murder పథకం ప్రకారం భర్తను చంపిన సోఫియా.. అమె ప్రియుడు..

Kerala woman lover get over 20 years in jail for poisoning husband

Kerala woman murder husband australia, cyanide murder australia, kerala woman lover murder husband, sam abraham murder, sam abraham

Nearly three years after the murder of Keralite Sam Abraham in Melbourne, an Australian court has sentenced his widow and her lover to over 20 years in jail.

స్వాతిని మించిన సోఫియా.. హత్య గుట్టును విప్పిన ప్రేమ డైరీ

Posted: 06/23/2018 11:11 AM IST
Kerala woman lover get over 20 years in jail for poisoning husband

మహాబూబ్ నగర్ జిల్లాలో ప్రియుడ్ని తన భర్త స్థానంలోకి తీసుకువచ్చేందుకు స్వాతి అడిన సినిమా ఫక్కీ కథ గుట్టును పాయ పట్టించినట్టే.. మరో ఘటనలో కూడా ప్రియుడితో శాశ్వతంగా వుండాలని భావించిన ఓ వివాహిత తన భర్తను దారుణంగా హతమార్చిన గుట్టును అమె ప్రేమ పుస్తకం పట్టించింది. ఒక్కప్పుడు భర్తల చేతిలో భార్యలకు చావు రాసిపెట్టివుందన్న అందోళన మాత్రమే వ్యక్తమయ్యేది. కానీ తాజాగా పెళ్లి పేరుతో ఒక్కటవుతున్న వీరిలో ఎవరి చేతిలో ఎవరి మరణ వుంటుందోనన్న అందోళన రేకెత్తించేలా మారుతున్నాయి పరిస్థితులు.

దుబాయ్ కి ఉపాధి కోసం వలస వెళ్లిన ఆ యువకుడు అక్కడ సెటిల్ అయిన తరువాత ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. అమెను కూడా అస్ట్రేలియాకు తీసుకువచ్చాడు. అయితే అప్పటికే ఆయన భార్యకు మరో కేరళకు చెందిన యువకుడితో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరికీ అక్కడి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పరిచయం ఏర్పడింది. తన భర్తను పెళ్లి చేసుకున్నా.. అమెకు తన ప్రియుడిపై మాత్రం ప్రేమ కాసింతైనా తగ్గలేదు. అందుకు వారు అప్పటికే అన్ని రకాలుగా దగ్గరయ్యారు. వారి మధ్య అన్ని రకాల బంధం ఏర్పడింది.

భర్త దుబాయ్ లో స్థిరపడినా.. తన ఉద్యోగం కోసం అమె 2012లో తన ఆరేళ్ల కొడుకుతో అస్ట్రేలియాకు వెళ్లింది. దీంతో వేరే యువతితో వివాహమైన తన ప్రియుడు కూడా.. ఆయన భార్య పిల్లలను కేరళాలోనే వదిలేసి 2013లో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ చేరుకున్నాడు. అక్కడికి వెళ్లిన తరువాత వీరిద్దరికీ మధ్య మళ్లీ బంధం చిగురించింది. తాము ఇద్దరం కలసి మళ్లీ సహజీవనం చేయాలని సోఫియా, అరుణ్ లు భావించి.. అందుకు అడ్డుగా వున్న తన భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం వేసి.. దానిని పక్కగా అమలు చేసేందుకు అరేంజ్ జ్యూస్ లో సైనైడ్ ను కలిపి ఇచ్చి చంపేశారు.

ఈ కేసును విచారించిన అస్ట్రేలియా న్యాయసానం భారత సంతతి మహిళ, ఆమె మాజీ ప్రియుడికి 20 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించింది. 34 ఏళ్ల సోఫియా సామ్, అరుణ్ కమల్ హాసన్ అనే వ్యక్తితో కలిసి 2015 అక్టోబర్లో మెల్‌బోర్న్ లోని తన ఇంట్లోనే భర్త సామ్ అబ్రహాంను హత్య చేసిన కేసులో.. సైనెడ్‌ను జ్యూస్‌లో కలిపి హత మార్చాలని అరుణ్ ప్లాన్ వేయగా.. దానిని పక్కగా అమలు చేసిన సోఫియాలకు న్యాయస్థానం దోషులుగా నిర్థారించి శిక్ష వేసింది. మర్డర్ ప్లాన్ రూపొందిన అరుణ్‌కి 27 ఏళ్ల.. అమలుపర్చిన సోఫియాకు 22 ఏళ్ల కారాగారావాసం విధిస్తూ తీర్పును వెలువరించింది.

అయితే వీరి నేరం ఎలా రుజవైందంటే.. సోఫియా భర్త అబ్రహం హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయాడని తొలుత భావించారు అక్కడి పోలీసులు. తర్వాత విష ప్రయోగం చేసి హతమార్చారని పోస్టుమార్టం నివేదిక ద్వారా తేలింది. సుదీర్ఘ విచారణ అనంతరం పోలీసులు అరుణ్, సోఫియాలను దోషులుగా తేల్చారు. అదెలా అంటే.. అబ్రహాం హత్యకు గురైన తర్వాత చాలా నెలలపాటు డిటెక్టివ్‌లు సోఫియా, అరుణ్‌ కదలికలపై నిఘా పెట్టారు. వారు ఎక్కడ కలుసుకుంటున్నారు, ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించారు. ఈ కమ్రంలో అరుణ్ కు సోఫియా రహస్య డైరీ ఇచ్చిన విషయాన్ని కనిపెట్టారు. ఆ డైరీలో ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను అక్షరీకరించారు. దానిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వీరిద్దరే పథకం ప్రకారం అబ్రహాంను చంపారని విచారణలో కనుగొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles