Chandrababu, Pawan meet at idol ritual ఎలావున్నారంటూ పవన్ ను పలకరించిన చంద్రబాబు

Naidu pawan come face to face offer special pujas at nambur

pawan kalyan, janasena, Pawan Kalyan amaravati, pawan kalyan lingamaneni township, pawan kalyan nambur, pawan kalyan guntur, pawan kalyan chandrababu, chandrababu pawan kalyan, chandrababu dattapeetam, chandrababu nambur, chandrababu lingamaneni township andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan who attended a religious ritual at amaravati had wished ap cm chandrababu who attended the same function at the same time.

‘‘ఎలావున్నారు’’ పవన్ ను పలకరించిన చంద్రబాబు

Posted: 06/23/2018 10:39 AM IST
Naidu pawan come face to face offer special pujas at nambur

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య ఐధేళ్లుగా సాగిన మైత్రి బీటాలు వారిన నాటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సమయం దొరికినప్పుడల్లా ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ప్రత్యేక హోదా, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుచేసే విషయంలో కాలయాపన సాగుతున్న క్రమంలో గుంటూరు జిల్లాలోని సభావేధిక నుంచి పవన్.. టీడీపీ సర్కారుపై అనేక విమర్శలు అరోపణలు సంధించారు.

అయితే తాజాగా ఈ ఇద్దరు నేతలు దత్తఫీఠం ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర దశావతార విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కలుసుకున్నా.. కనీసం పలకరించుకోలేదని వచ్చిన వార్తల్లో నిజం లేదు. చంద్రబాబు రాగానే పవన్ కల్యాన్ మర్యాదపూర్వకంగా సార్ బాగున్నారా.? అని పలకరించారు. దానికి సీఎం కూడా నేను బాగున్నాను.. మీరు బాగున్నారా.? అంటూ కుశలం అడిగారట. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అగ్ర నేతలు పావుగంటపాటు సమావేశం కావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఏం మాట్లాడుకున్నారు? అన్నదానిపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.

విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై రెయిన్ ట్రీ పార్క్ సమీపంలోని లింగమనేని ఎస్టేట్స్ లో దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. అనంతరం చంద్రబాబు-పవన్ లను గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి పిలిచి ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ వారు ముగ్గురూ పావుగంట పాటు సమావేశమై వివిధ అంశాల గురించి ప్రస్తావించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి ఉన్నారు కాబట్టి రాజకీయాల గురించి వారు ప్రస్తావించి ఉండకపోవచ్చని అంటున్నారు. ఆధ్యాత్మిక అంశాలపై చంద్రబాబు-పవన్ చర్చించి ఉండొచ్చని చెబుతున్నారు. టీడీపీ వర్గాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి.
 
విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి చంద్రబాబు కంటే ముందే పవన్ తన సతీమణితో కలిసి చేరుకున్నారు. గర్భాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినప్పుడు పక్కపక్కనే నిల్చున్న చంద్రబాబు-పవన్ ఒకరి నొకరు పలకరించుకున్నారు. తొలుత పవన్ ‘సార్ బాగున్నారా?’ అని పలకరించారు. స్పందించిన సీఎం.. ‘బాగున్నాను.. మీరెలా ఉన్నారు?’ అని ప్రతిస్పందించారు. విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తయ్యాక వేదపండితులు తొలుత పవన్‌కు ప్రసాదం ఇవ్వబోగా.. ‘‘కాదు, కాదు.. తొలుత సీఎం గారికి ఇవ్వండి’’ అని పవన్ అన్నారు. చంద్రబాబు పుచ్చుకున్నాక పవన్ తీసుకున్నారు. మొత్తానికి ఉప్పు-నిప్పులా ఉండే నేతలు ఇద్దరూ ఒకే గదిలో 15 నిమిషాలు కలిసి కూర్చుని మాట్లాడడం చర్చనీయాంశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  chandrababu  dattapeetam  guntur  andhra pradesh  politics  

Other Articles