Pawan Kalyan about TTD ruby diamond controversy శ్రీవారి ఆభరణాలు, టీటీడీపై జనసేనాని ఏమన్నారంటే..

Pawan kalyan about ttd and ruby diamond controversy

Jana sena, Pawan Kalyan, twitter, tirumala tirupathy devasthanam, srivari ruby diamond, retd ias officer, TTD, sri vari nagalu, ttd abharanalu, srivari abaranalu, middle east countries, ramana deekshitulu, TDP, Society,Lord Balaji Pink Diamond missing theory,Tirupati Pink Diamond missing controversy,Power Star Pawan Kalyan,Pink Diamond missing controversy,Tirupati priests community,Jana Sena Party chief,Chief priest Ramana Deekshitulu, Andhra pradesh, special status, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief, power star pawan kalyan supports ttd former chief priest ramana deekshitulu allegations on srivari abharanalu, says retired ias shared key information wwith him in this regard.

శ్రీవారి ఆభరణాలు, టీటీడీపై జనసేనాని ఏమన్నారంటే..

Posted: 06/21/2018 02:35 PM IST
Pawan kalyan about ttd and ruby diamond controversy

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. టీడీపీ సర్కార్ ప్రజలకు రక్షణదారుగా కాకుండా భూఆక్రమణదారుగా వ్యవహరిస్తుందని వరుస విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన ఏకంగా టీటీడీలోని శ్రీవారి అభరణాలు, రూబీ డైమండ్ ఏమయ్యాయన్న విషయమై కూడా ఆయన ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వంపై, టీటీడీపై పెద్దఎత్తున్న దుశ్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు కలుగుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా వారిపై వుందదని చురకలంటించారు.

ఇవాళ మధ్యాహ్నం రాజధాని భూములపై స్పందించిన పవన్.. భూముల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే కబ్జాలకు అండగా ఉంటోందని ఆరోపించారు. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే సరిపడా భూముల్ని సమీకరించినందున భూసేకరణ చట్టాన్ని ప్రయోగించవద్దని సూచించిన ఆయన, అలా చేస్తే తాను పోరాటం చేస్తానని పవన్ హెచ్చరించారు. ఈ అంశంపై అమరావతి ప్రాంత రైతులతో తాను సమావేశం కానున్నట్లు తెలిపారు. సోంపేట థర్మల్ విద్యుత్, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రాల విషయంలో ప్రభుత్వ వైఖరిని సైతం పవన్ తప్పుబడుతూ ట్వీట్ చేశారు.

‘ఏపీ సీనియర్ రాజకీయ నాయకులు తమ దోపిడీలను ఆపాలి.. వెనుకబడిన ఉత్తరాంధ్రను ఇంకా శాశ్వతంగా అలాగే ఉంచడానికి ప్రయత్నిస్తూ కాలుష్యకారక పరిశ్రమలను ఏర్పాటుచేసి దాన్ని ఓ డంపింగ్ యార్డుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని’ దుమ్మెత్తిపోశారు. అలాగే శ్రీవారి ఆభరణాలపై రమణదీక్షితుల ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదని అన్నారు. ‘గులాబీ రంగు వజ్రంతోపాటు విలువైన ఆభరణాలు మాయమైనట్టు టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు లేవనెత్తిన అంశంపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదు’ అంటూ విమర్శించారు.
v


‘భక్తులు విసిరిన నాణేలుకు గులాబీ రంగు వజ్రం ముక్కలైందని అంటున్నారు.. అందులో ఉన్న నిజమెంతో భక్తులుగా తెలుసుకోవాలనుకుంటున్నాం.. అలాంటప్పుడు ఆ శకలాలను ఎందుకు ఫోరెన్సిక్ నిపుణులతో పరీక్షించడం లేదు.. మరి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలనే సామెత కూడా ఉంది కదా’అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జూన్ 23న పవన్ కళ్యాణ్ విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా ఈ నెల 26 నుంచి విశాఖలో పోరాట యాత్ర పునః ప్రారంభం కానుంది. twitter-tweet"

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana sena  Pawan Kalyan  twitter  ramana deekshitulu  TTD  abharanalu  middle-east countries  andhra pradesh  

Other Articles