Nearly 180 missing in Indonesia ferry mishap ఇండోనేషియాలో పడవ ప్రమాదం.. 192 మంది గల్లంతు..

Number missing in indonesia ferry disaster jumps again to 192

ferry disaster indonesia, indonesia ferry disaster, sumatra ferry disaster, lake toba ferry disaster, ferry disaster at indonesia tourist place, 190 missing, boat capsize, lake toba, sumatra, indonesia, crime

As many as 192 passengers could be missing after a ferry sank into the depths of a volcanic lake in Indonesia, the search-and-rescue agency said Wednesday, tripling initial government estimates

ఇండోనేషియాలో పడవ ప్రమాదం.. 192 మంది గల్లంతు..

Posted: 06/21/2018 09:21 AM IST
Number missing in indonesia ferry disaster jumps again to 192

ఇండోనేషియాలో సంభవించిన పెను ప్రమాదంలో గల్లంతైన వారి సంఖ్య 192కు చేరింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు స్వయంగా ప్రకటించారు. సుమత్రా దీవిలోని పర్యాటక కేంద్రమైన తోబా సరస్సులో సోమవారం జరిగిన పడవ ప్రమాదంలో మూడు మృతదేహాలను ఇప్పటివరకు అక్కడి రెస్క్యూ అధికారులు బయటకు తీసారు. కాగా ఈ ఘటనలో ఇంకా 192 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.

ఈ ఘోర ప్రమాద ఘటనలో తొలుత 60 మంది మృతి చెందినట్టు భావించామని, అయితే, తాజా గణంకాల ప్రకారం గల్లంతైన వారి సంఖ్య 192కు చేరుకుందని అధికారులు పేర్కొన్నారు. కేవలం 43 మంది ప్రయాణించే సామర్థ్యమున్న పడవలో ఏంత మంది ప్రయాణిస్తున్నారన్న విషయంలో ఇప్పటికీ స్పష్టత రాలేదని తెలిపిన అధికారులు.. అది ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన పడవని కూడా వెల్లడించారు.

టికెట్లు తీసుకోకుండా ఎక్కువ మందిని ఎక్కించుకున్నట్టు తెలుస్తోందన్నారు. ప్రయాణికులతోపాటు పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు కూడా పడవలో ఉన్నట్టు ఇండోనేషియా విపత్తు సంస్థ తెలిపింది. గలంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇండోనేషియా చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన పడవ ప్రమాదమని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 190 missing  boat capsize  lake toba  sumatra  volcanic lake  indonesia  crime  

Other Articles