Parakala resigns to TDP Govt post మీడియా సలహాదారు పదవికి పరకాల రాజీనామా

Parakala prabhakar resigns to media adviser post

parakala resigns to media adivisor post, parakala media advisor post, Parakala Prabhakar, Chief Minister, Chandrababu, YS Jagan, Nirmala Sitaraman, Telugu desam, politics

Parakala Prabhakar, the Media Adviser to the Government of Andhra Pradesh has resigned to his post. Parakala Prabhakar has reportedly hurt by the comments made by YSRCP and its Chief YS Jagan Mohan Reddy.

ఏపీ మీడియా సలహాదారు పదవికి పరకాల రాజీనామా

Posted: 06/19/2018 03:09 PM IST
Parakala prabhakar resigns to media adviser post

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన తన రాజీనామా లేఖను పంపుతూ, తక్షణమే ఆమోదించాలని కోరారు. తనపై కొన్ని రోజులుగా కొందరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా తనను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న యత్నాలకు తాపే అవకాశం ఇవ్వడం ఇష్టంలేక తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్ తాను చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నిన్న తూర్పుగోదావరిలో మాట్లాడుతూ ఇక్కడ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నట్లు చంద్రబాబు బిల్డప్‌ ఇస్తూ బీజేపీని తిడతారని.. మరోపక్క కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను తన పక్కనే పెట్టుకుంటారని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నట్లు పరకాల పేర్కొన్నట్లు సమాచారం. పరకాల ప్రభాకర్‌ నాలుగేళ్లుగా ప్రభుత్వ మీడియా సలహాదారుగా ఉంటూ కీలకంగా వ్యవహరిస్తూ నవ్యాంధ్ర పునర్‌నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్నారు.

ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు రాసీన లేఖలో తాను ప్రభుత్వ సలహాదారుగా వుండటాన్ని కొందరు ఎత్తిచూపుతున్నారని పేర్కోన్నారు. కేంద్రంపై జరుగుతున్న ధర్మపోరాట విషయంలో ప్రజల్లో అనుమానాలు లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే తాను తప్పుకుంటున్నట్లు చెప్పారు. ప్రభుత్వంలో తన ఉనికిని, ప్రభుత్వాధినేత చిత్తశుద్దినీ శంకించడానికి వాడుకుంటున్నారని కూడా వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత బాంధవ్యాలకు రాజకీయ ప్రయోజనాలను అపాదిస్తున్నారని ఆయన కలతచెందారు. తన కుటుంబసభ్యులు వేరే పార్టీలో తనకు భిన్నమైన అభిప్రాయాలు కలిగివున్నందుకు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీపడతానని ప్రచారం చేయడం బాధ కలిగిస్తుందని అవేదన వ్యక్తం చేశారు.

పరిణితి చెందిన వ్యక్తులు ఎవరి రాజకీయాభిప్రాయాలకు వారు నిబద్దులుగా వుంటారని పరకాల చురకలంటించారు. వారి అభిప్రాయాలు పట్ల, వారికున్న అంకిత బాంధవ్యాలు అడ్డురావని పేర్కోన్నారు.
రాష్ట్ర హక్కుల సాధనకు చేపట్టిన ధర్మపోరాట దీక్ష విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిపై నీలినీడలు పడకూడదన్నది తన కోరికగా ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కోన్నారు. తన వల్ల, చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం జరగకూడదన్నదే తన అభిప్రాయంగా చెప్పుకోచ్చారు. సీఎంపైన, ఆయన ప్రభుత్వంపైనా బురదజల్లడానికి, లేనిపోని అరోపణలు చేయడానికి తన పేరును, తన కుటుంబ సభ్యుల పేర్లను ఎవ్వరూ వాడుకోకూడదని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Parakala Prabhakar  Chief Minister  Chandrababu  YS Jagan  Nirmala Sitaraman  Telugu desam  politics  

Other Articles