Ram Sene chief likens Gauri Lankesh to a dog గురి తప్పుతున్న రామదండు.. విషం చిమ్ముతారా.?

Ram sene chief pramod muthalik likens gauri lankesh to a dog

Pramod Muthalik, dog, Pramod Muthalik on Gauri Lankesh, Sri Ram Sene chief on gauri lankesh, journalitst gauri lankesh, social activist gauri lankesh, just asking prakash raj, prakash raj, Parashuram Waghmare, Rakesh Math, karnataka, crime news

"No one questioned the Congress government's failure... instead these Left-leaning intellectuals ask PM Modi to speak on Gauri Lankesh's death. Do you expect Modi to respond every time a dog dies in Karnataka," Pramod Muthalik, the chief of the Karnataka-based rightwing group Sri Ram Sene, questioned.

గురి తప్పుతున్న రామదండు.. విషం చిమ్ముతారా.?

Posted: 06/18/2018 04:55 PM IST
Ram sene chief pramod muthalik likens gauri lankesh to a dog

శ్రీరామసేన పేరుతో అవిర్భవించిన ఆయన దండు గురితప్పుతుందా.? రాముడు మంచి బాలుడు అన్న కథలు ఇక కథలేనా.. రాముడ్ని కూడా హింసావాదిగా చిత్రీకరించే ప్రయత్నాలకు, రాముడి పేరుతో దారుణాలకు పాల్పడే చర్యలకు కొందరు పాల్పడుతున్నారా..? ఆ దేవదేవుడికే అపఖ్యాతిని తీసుకురావాలని యత్నిస్తున్నారా.? అసలు మనకు రామాయణం చెప్పిందేమిటీ.? రాముడి పేరుతో ఏర్పడిన సేన చేస్తున్నదేమిటీ.? ఇప్పుడీ ప్రశ్నలు హిందువులనే కలవరపరుస్తున్నాయని చెప్పక తప్పదు.

కర్ణాటకలో హత్యకు గురైన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ పై శ్రీరామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు శ్రీరాముడి గౌరవానికి భంగం కలిగించేవిగా వున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. హిందువుల అరాధ్యదైవమైన శ్రీరాముడిని కూడా రాజకీయాల్లోకి లాగి దేవుళ్లను కూడా అప్రతిష్టపాలు చేస్తారా.? అన్న ప్రశ్నలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. శీ్రరాముడుి పేరుతో సంఘాలను ఏర్పాటు చేసి.. రాముడి హితోక్తులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తప్పులేదు. కానీ అలాంటి సంస్థలకు అధినేతగా కొనసాగుతున్న వాళ్లు.. రాజకీయాలు మాట్లాడుతూ.. దేవుడ్ని మధ్యలోకి లాగడం ఎందుకని ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి.

 లంకేశ్ హత్య కేసులో ప్రధాని మౌనం వీడాలంటూ వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించిన శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముథాలిక్ స్పందిస్తూ.. ‘‘కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే, దానికి మోదీ ఎందుకు స్పందించాలి?’’ అంటూ వ్యాఖ్యానించడం తగునా.? అంటూ విమర్శలు వెల్లివిరుస్తున్నాయి. ఇక అది చాలదన్నట్లు కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో రెండు, మహారాష్ట్రలో రెండు హత్యలు జరిగాయి.. అప్పుడు తప్పుబట్టని వారు.. కర్ణాటకలో ఓ కుక్క చనిపోతే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారని ఆయన దారుణమైన వ్యాఖ్యలు చేసి.. ఓ సామాజిక కార్యకర్తను, జర్నలిస్టును కుక్కతో పోల్చడం తగునా.? అంటూ విమర్శిస్తున్నారు

ప్రమోద్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన ఆయన తరువాత సంజాయిషీ ఇచ్చుకున్నారు. కర్ణాటకలో జరిగే ప్రతీ హత్యకు ప్రధాని సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే అలా అన్నాను తప్పతే, లంకేశ్‌ను నేరుగా కుక్క అని ప్రస్తావించలేదని వివరణ ఇచ్చారు. అయితే గౌరి లంకేశ్ ను హత్య చేసిన నిందితుడు పరశురామ్ ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు, శ్రీరామ్ సేనతో అతడికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపాయి. ఈ క్రమంలో శ్రీరామదండు గురి తప్పిందని, రాముడి దైవత్వానికి కూడా అపఖ్యాతి తీసుకువస్తున్నారన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pramod Muthalik  dog  Gauri Lankesh  Sri Ram Sene  Parashuram Waghmare  Rakesh Math  crime news  

Other Articles