Mars to come closest to Earth in 15 years next month ఖగోళంలో అద్భుతం.. భూమికి చేరువగా అరుణగ్రహం..

Mars to reach closest point to earth in 15 years for this reason

mars about to get very bright summer 2018, astronomy essentials, Mars, Earth, Sun, planets, NASA, red planet, perihelic opposition, mars opposition, aphelion, perihelion, stars, galaxy, solar system

Mars is getting bright! But it’s still up between midnight and dawn. Between now and July, the red planet will shift over into the evening sky … and then the drama will begin!

ఖగోళంలో అద్భుతం.. భూమికి చేరువగా అరుణగ్రహం..

Posted: 06/18/2018 02:39 PM IST
Mars to reach closest point to earth in 15 years for this reason

ఖగోళంలో అద్భుత దృష్యం అవిష్కృతం కానుంది. అరుణగ్రహంగా పేరొందిన మార్స్ జులై మాసంలో భూమికి అత్యంత చేరువగా రానుంది. దీంతో వచ్చే నెల అంగారక గ్రహాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం లభించనుంది. జూలై 27న మార్స్ సూర్యునికి ఎదురుగా రానున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తెలిపింది. అదేంటి ప్రతీ రెండేళ్లకు ఓ సారి భూమికి అరుణ గ్రహం చేరువగా వస్తుంది కాదా.? దానినెందుకు అద్భుతంగా పరిగణిస్తునన్నారు.. అంటే..

భూమి, అంగారక గ్రహాలు ప్రతీ రెండేళ్లు ఓ సారి వాటి వాటి నిర్ణీత క్షక్ష్యల్లో ప్రయాణిస్తూ ఎదురై.. వెళ్లిపోతుంటాయి. ఇది అన్ని గ్రహాలకు ఏర్పడే సాధారణ విషయమే. అయితే ఫెరీహెలిక్ అపోజిషన్ అనే అద్భుతం మాత్రం వచ్చే నెల అవిష్కృతం కానుంది. అంటే నిండు ఫౌర్ణమి, అమావాస్యల తరహాలో.. భూమి, చంద్రుడు సూర్యడు వాటి కక్ష్యలో ఒక వరుస క్రమంలో వచ్చి ఏర్పడినట్లే.. ఫెరిహెలిక్ గా భూమి, అరుణ గ్రహాలు సూర్యుడితో కలసి ఒకే వరుసలో ఏర్పడతాయి. భూమికి పైన అంగారకుడు.. దానిపైన సూర్యుడు ఇలా వరుసక్రమంలో నిలుస్తారు. ఇలా కనీసం 15 నుంచి 17 సంవత్సరాల మధ్యకాలంలో ఒక్కసారి అవిష్కృతం అవుతాయి.

ఇలాంటి పరిణామం చోటుచేసుకున్న సమయంలో సూర్యుని వెలుగుతో అంగారకుడు వెలిగిపోనున్నాడు. అయితే ఈ వరుస క్రమంలో భూమి, అంగారకుడు తమ క్షక్ష నుంచి కొద్దిగి పక్కకు కూడా ఒరిగిపోతారు. 2017వ సంవత్సరంలో కనిపించకుండా పోయిన అరుణ గ్రహం తాజాగా తన వెలుతురును విరజిమ్మతున్నాడు. అయితే ఆలాంటి అవిష్కరణ 2003లో జరిగింది. కానీ అప్పటి కన్న ఇప్పుడు రానున్న ఫెరి హెలిక్ అపోజిషన్ లో అరుణ గ్రహం భూమికి అత్యంత చేరువకు చేరుకోనుందని.. ఇలా దాదాపుగా 60 వేల సంవత్సరాల తరువాత మాత్రమే జరుగుతుందని నాసా తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mars  Earth  Sun  planets  NASA  perihelic opposition  stars  galaxy  solar system  

Other Articles