will avenge aurangzebs death say army jawans brother ఔరంగజేబు మరణంపై ప్రతీకారం తీర్చుకుంటాం

We will avenge aurangzebs death says army jawans brother

Indian army jawan aurangzeb, Indian army martyr, Aurangzeb family, terrorist video, Aurangzeb brother, viral video, social media aurangzeb, army martyr, pakistan, terrorist, video, 100 heads, victims brother

"I appeal to Prime Minister Narendra Modi to take swift action in this. 100 of their people should pay the price for the death of my brother. If you (the government) are not able to do so, then tell us, we will do it ourselves," his brother said.

ఔరంగజేబు మరణంపై ప్రతీకారం తీర్చుకుంటాం

Posted: 06/18/2018 01:29 PM IST
We will avenge aurangzebs death says army jawans brother

గతంలో ఏ ప్రధాన మంత్రి దేశ భద్రత వ్యవహారాలను ఎన్నికల ప్రచారాస్త్రంగా మార్చుకున్న దాఖలాలు లేవు. కానీ నరేంద్రమోడీ మాత్రం గత సార్వత్రిక ఎన్నికలకు ముందు భారత జవాన్ల 56 ఇంచుల ఛాతిపై వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రాంతంలో ఇద్దరు భారతీయుల తలలు నరికీ పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు తీసుకెళ్లడాన్ని అక్షేపించిన ఆయన ఈ సందర్బంగా అర్మీని కూడా ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. ఇక పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిభిరాలపై దాడులకు తెగబడి చేసిన సర్జికల్ స్ట్రైక్స్ విషయాన్ని కూడా తన ప్రభుత్వ గొప్పదనంగానే చెప్పుకురావడంపై కూడా విమర్శలను ఎదుర్కొన్నారు.

అయితే ఇదే క్రమంలో ప్రధానికి ఆర్మీ జవాన్ల నుంచి కూడా విన్నపాలు పెరిగాయి. తమకు నీళ్ల చారు. ఎండిన రోట్టేలు ఇస్తున్నారని ఓ జవాను అరోపించడంతో అతన్ని అర్మీ అధికారులే మతిస్థిమితం సరిగా లేదని ముద్రవేసే ప్రయత్నాలు చేశారు. ఇలా పలువురు జవాన్లు తమ అవేదనను ప్రధానికి మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో తాజాగా తన సోదరుడు ఔరంగజేబును పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్ లో అత్యంత పాశవికంగా కాల్చి చంపిన ఘటనపై అయన సోదరుడు కూడా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు.

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అతను.. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఓ విన్నపం చేశాడు. మోదీ గారూ... మా సోదరుడుని చంపిన ఉగ్రవాదులపై మీరు ప్రతీకారం తీర్చుకుంటారా.. లేదా.? లేని పక్షంలో ఆ పనిని తామే చేయమంటారా? అని ప్రశ్నించారు. తన అన్న మరణానికి ప్రతీకారంగా వంద మంది ఉగ్రవాదుల తలలు నరికి తీసుకురండి అని ప్రధాని మోదీని ఆయన కోరారు. అయితే తన సోదరుడి మాదిరిగానే తాను ఇండియన్ అర్మీ జవానుగానే విధులు నిర్వహిస్తున్న ఔరంగజేబు సోదరుడు.. తమ గ్రామంలో ఎవరూ రంజాన్ పండగ చేసుకోలేదని చెప్పాడు.

తన సోదరుడి మరణంతో రంజాన్ పర్వదినాన తమ గ్రామమంతా విషాదంలో మునిగిపోయిందని చెప్పాడు. తన సోదరుడు మరణానికి ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న అవేదనను, అవేశాన్ని గ్రామస్థులంతా పంచుకుంటున్నా.. తీరడం లేదని, ఆ మరణానికి వంద తలలు తెగాల్సిందేనని అన్నాడు. ఈ సాయంత్రంలోగా ఘటనకు సంబంధించిన వివరాలను తెలపాలని కోరిన మృతుడి సోదరుడు... లేకపోతే తానే రాష్ట్రీయ రైఫిల్స్ కార్యాలయానికి వచ్చి, ప్రభుత్వంతో మాట్లాడి, ఏం చేయాలో నిర్ణయిస్తానని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aurangzeb  army martyr  pakistan  terrorist  video  100 heads  victims brother  

Other Articles