I pumped 3 bullets into Gauri Lankesh, says Accused గౌరీలంకేష్ నిందుతుడి హిట్ లిస్టులో ప్రముఖులు

Girish karnad several others were on the hit list of suspects say police

Rama Sene, Gauri Lankesh murder suspect, Gauri Lankesh murder case, gauri lankesh murder, Gauri Lankesh, Sri Rama Sene chief Pramod Muthalik, social media, girish karnad, B T Lalitha Naik, pontiff Veerabhadra Channamalla Swamy, Nidumamidi Mutt, C S Dwarakanath, SIT, karnataka, crime

In another development to the Gauri Lankesh murder case, an undated photograph of the key suspect Parshuram Waghmare’s with Sri Ram Sene chief Pramod Muthalik has surfaced. Girish Karnad, along with several other litterateurs and rationalists were also on the list.

గౌరీలంకేష్ నిందుతుడి హిట్ లిస్టులో ప్రముఖులు

Posted: 06/14/2018 12:21 PM IST
Girish karnad several others were on the hit list of suspects say police

కన్నడ ప్రముఖ రచయిత, జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ ను హత్య చేసిన నిందితుల హిట్ లిస్టులో మరెందరో ప్రముఖులు వున్నారని పోలీసులు తెలిపారు. శ్రీరామసేన సభ్యుడిగా అనుమానిస్తూన్న అరవ నిందితుడు పరుశురామ్.. తమ విచారణలో వెల్లడించిన విషయాలను పంచుకున్న పోలీసలు.. తమ విచారణలో భాగంగా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు కూడా ప్లాన్ వేస్తున్నారని.. వారి జాబితాలోని తరువాత పేరు ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ దేనని తెలిపారు.

వారి నుంచి లభ్యమైన ఓ డైరీని పరిశీలిస్తే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని, ఆ డైరీలో వారు దేవంగారి బాషలో రాసుకున్న వివరాల ప్రకారం నిందితుల హిట్ లిస్టు జాబితాలో గిరీష్ తో పాటు రాజకీయ నేత బీటీ లలితా నాయక్, నిడుమామిడి మఠం పీఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామి, సీఎస్ ద్వారకాంత తదితరులనూ హత్య చేయాలని పరశురామ్ నిర్ణయించుకున్నట్టు వారి పేర్లను డైరీలో రాసుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే హిట్ లిస్టులో నెక్ట్స్ టార్గెట్ గా గిరీష్ కర్నాడ్ ఉన్నట్టు తెలిసింది.

గత సంవత్సరం సెప్టెంబర్ లో గౌరీ లంకేష్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే గిరీష్ కర్నాడ్ ను హత్య చేయాలని నిందితుడు రెక్కీ నిర్వహించాడని, ఇది సమయం కాదని హత్య నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, నిందితుడు పరశురామ్, శ్రీ రామసేన సభ్యుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కరుడుగట్టిన హిందుత్వ వాది అయిన పరశురామ్, హిందూ ముస్లింల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్న ఆలోచనతో 2012లో సిడంగి అనే ప్రాంతంలో పాకిస్థాన్ జెండాను ఎగురవేశాడని తెలిపారు. కాగా, పరశురామ్ ను కోర్టు ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి న్యాయమూర్తి ఆదేశించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : parashuram  Rama Sene  Gauri Lankesh  Pramod Muthalik  social media  girish karnad  B T Lalitha Naik  crime  

Other Articles