"Produce Sanskari Kids Or Stay Infertile," బీజేపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Produce sanskari kids or stay infertile bjp lawmaker s tip for women

Pannalal Shakya, Virat Kohli's patriotism, garibi hatao, garib hatao, congress, sanskari kids, BJP MLA, Guna, Madhya Pradesh

BJP lawmaker from Madhya Pradesh says women rather remain infertile than produce kids who are not "sanskari"

బీజేపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 06/14/2018 09:57 AM IST
Produce sanskari kids or stay infertile bjp lawmaker s tip for women

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీని ఇబ్బందుల పాటు చేయవద్దని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలకు అదేశాలు జారీ చేసినా.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం తమను మరింతగా వెనకేసుకోస్తున్నారన్ని భావనతో పలువురు నేతల్లో ఒక్కో నేత ఒక్క విధంగా వివాదాస్పద వ్యాఖ్యలను చేసి వీళ్లు అసలు నేతలేనా..? ఇలా కూడా మాట్లాడి వాక్ స్వాతంత్ర్యం అనవచ్చా.? అన్న సందేహాలు కలుగుతున్నాయి.

మరి అదే ప్రతిపక్షాలు మాట్లాడితే కేసులు, కోర్టులు ఎదుర్కోవాలా.? అధికారంలో వున్న వారికి ఓ చట్టం, అనదికారంలో వున్న వారికి మరోచట్టం.. ఇక సంపన్నులకు ఇంకో చట్టం..వీళ్లందరికీ చట్టంలో కాస్తో కూస్తో మినహాయింపులు వుంటాయి.. కానీ సామాన్యులపై మాత్రమే చట్టం అన్ని సెక్షన్లు పకడ్భంధీగా పనిచేస్తుంది. ఇక స్థానిక బీజేపి నేతలు మాత్రం పాపులారిటీ సంపాదించాలంటే చౌకబారు వ్యాఖ్యలు చేయాల్సిందేనని చెలరేగిపోతున్నారు

తాజాగా, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్యా, కాంగ్రెస్ నేతల తల్లులను ఉద్దేశించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 'గరీబీ హఠావో' నినాదాన్ని ప్రస్తావించిన ఆయన, ఆ పార్టీ పేదలను నిర్మూలించిందని ఆరోపిస్తూ, కొందరు మహిళలు ఇటువంటి సమాజాన్ని చెడగొట్టే నాయకులకు జన్మనిస్తున్నారని, అటువంటి వాళ్లు పిల్లలను కనేకంటే గొడ్రాళ్లుగా మిగిలిపోతే దేశానికి మేలు జరిగుండేదని వ్యాఖ్యానించారు.

తన సొంత నియోజకవర్గం గుణలో జరిగిన ఓ సభలో పాల్గొన్న ఆయన, కుసంస్కారులను కనడం కంటే సంతాన హీనులుగా మిగిలిపోయుంటే బాగుండేదని అన్నారు. శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్యను ప్రతి మహిళా రోల్ మోడల్ గా తీసుకోవాలని అన్నారు. శాక్యా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారేమీ కాదు. గతంలో గుణ ప్రభుత్వ కాలేజీలో బాలికలకు సేఫ్టీ టిప్స్ ఇస్తూ, బాయ్ ఫ్రెండ్స్ ను తయారు చేసుకోకుంటే, ఎవరికీ ఎటువంటి వేధింపులు, అత్యాచారాలు ఎదురు కాబోవని వ్యాఖ్యానించి విమర్శలు కొని తెచ్చుకున్నారు.

భారత క్రికెట్ జట్టుక కెప్టెన్ విరాట్ కోహ్లీనీ వదిలిపెట్టలేదు శాక్యా. ఇండియాలో డబ్బును సంపాదిస్తున్న కోహ్లీకి, ఈ దేశం అంటరానిది అయిపోయిందా? అని ప్రశ్నిస్తూ, తన వివాహ వేదికను ఇటలీలో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో చెప్పాలని నిలదీశారు. దేశంపై కోహ్లీకి గౌరవం లేదని, ఇక్కడ సంపాదించిన కోట్ల రూపాయల డబ్బును, తన పెళ్లి కోసం ఇటలీలో ఆయన ఖర్చు పెట్టాడని నిప్పులు చెరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles