Motkupalli fires on CM Chandrababu again ‘‘చంద్రబాబు కోసం వెంకన్నస్వామికి మొక్కుకుంటా’’

Motkupalli narsimhulu fires on cm chandrababu again

motkupalli press meet, motkupalli media, motkupalli alipiri, TTDP, TDP, motkupalli narasimhulu, tdp, Motkupalli Narasimhulu aleru, telangana, Andhra Pradesh. politics

Telangana TDP expelled leader motkupalli narsimhulu once again fires on Andhra pradesh CM chandrababu, says he will pray lord srivaru of tirumala for his ex boss defeat.

‘‘చంద్రబాబు కోసం వెంకన్నస్వామికి మొక్కుకుంటా’’

Posted: 06/13/2018 04:39 PM IST
Motkupalli narsimhulu fires on cm chandrababu again

రాష్ట్రంలో సమగ్ర మార్పుల కోసం తాను కృషి చేస్తున్నానని, ఇప్పటి వరకు పునాదుల దశలోనే వున్న అనేక కీలక పనులు పూర్తి కావాలంటే.. రానున్న ఐదేళ్లు అత్యంత కీలకమని, ఈ నేపథ్యంలో తనకు మరోమారు అధికారం అందిస్తే.. నిధులు లేని రాష్ట్రంలో కూడా ప్రగతిపథంలో పయనింపజేస్తున్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్ని అండగా వుంటారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఓ వైపు ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఆయన ఓడిపోవాలని తాను తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని మొక్కుకుంటానని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు.

తన మొక్కును తిరుమల శ్రీవారు బలంగా తీర్చాలని కోరుకుంటూ తనకు మోకాళ్ల నొప్పిని కూడా లెక్కచేయకుండా, ఏడుకొండలను మెట్లమార్గంలో కాలి బాటన ఎక్కి దేవదేవుడిని దర్శించికుంటాను.. అని చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ ఓడిపోవాలన్నదే తన కొరిక తప్ప మరే వాంఛలేదని అన్నారు. టీడీపీ పార్టీని ఎన్టీఆర్ కుటుంబీకులకు తక్షణం అప్పగించాలని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్నది దుర్మార్గపు టీడీపీ పార్టీ అని మోత్కుపల్లి విమర్శించారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు దొరికిన దొంగలు అని మోత్కుపల్లి ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నది వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధిపతి పవన్ కల్యాణ్ లేనని మోత్కుపల్లి అన్నారు. కాపులకు- బీసీలకు చంద్రబాబు గొడవ పెట్టారని, బ్రహ్మణుల్లో బ్రహ్మణులకు కూడా గొడవ పెట్టారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో బాబుకు ఓటమి తప్పదని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. టీడీపీని నందమూరి కుటుంబీకులకు అప్పజెప్పలని లేకపోతే బాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles