17 killed, 35 injured in UP bus accident ఘోర ప్రమాదం.. 17 మంది మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం

Uttar pradesh 17 killed after speeding bus hits divider several injured

Mainpuri road accident, Uttar Pradesh, bus hit divider, Mainpuri news, Yogi Adityanath, Mainpuri, Mainpuri, Bus Accident, UP accident

At least 17 people were killed and over 35 injured after a private bus hit a divider and overturned in the Mainpuri district of Uttar Pradesh

ఘోర ప్రమాదం.. 17 మంది మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం

Posted: 06/13/2018 10:49 AM IST
Uttar pradesh 17 killed after speeding bus hits divider several injured

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీకోనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందారు. బుధవారం తెల్లవారుజామున మెయిన్ పురి సమీపంలో దనహరా వద్ద సంభవించిన ప్రమాదంలో 35 మందికి పైగా గాయపడ్డారు. రాజస్థాన్ లోని జయపూర్ నుంచి యూపీలోని ఫరూక్కాబాధ్ వస్తోన్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు కిర్తాపూర్ గ్రామం వద్ద తెల్లవారు జామున ఉదయం 5 గంటల ప్రాంతంలో ఢివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ఘటనలో నిద్రలో వున్న 16 మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయ కార్యక్రమాలను ప్రారంభించి క్షతగాత్రులను వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా క్షతగాత్రులలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుందని చెప్పిన వైద్యులు వారిని ఎటావా జిల్లా అసుపత్రికి తరలించామని, అక్కడే చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

కాగా, అతివేగమే ప్రమాదాలకు కారణమని తెలిసినా.. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా.. బస్సు అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని బాధితులు తెలిపారు. అతివేగంతో బస్సు డివైడర్ ను ఢీకోనడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. గాయపడిన వారిలో డ్రైవర్ కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు కొంత మంది ప్రయాణీకులు బస్సు పైకప్పు మీద ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయానికి బస్సులో 50 మందికి పైగా ప్రయాణీకులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ  ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సీఎం సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles