PM Modi Shares His Fitness Challenge Video సీఎంకు సవాల్ విసిరిన ప్రధాని మోదీ

Pm modi challenges indian police force and hd kumaraswamy

Narendra Modi, Rajyavardhan Singh Rathore, Agni, Hrithik Roshan, Jal, Manika Batra, Karnataka CM Kumaraswamy, Indian police officers, Virat Kohli, Saina Nehwal, Smriti Irani, fit India, Fitness Challenge

After a long wait, PM Narendra Modi finally took up the fitness challenge thrown by Virat Kohli with panchtatvas and now issued a challenge to Manika Batra, Karnataka’s new CM Kumaraswamy and entire fraternity of Indian police officers, especially those over 40 years of age.

ITEMVIDEOS: సీఎంకు సవాల్ విసిరిన ప్రధాని మోదీ

Posted: 06/13/2018 10:12 AM IST
Pm modi challenges indian police force and hd kumaraswamy

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి సవాల్ ఎదుర్కోన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. సవాల్ ను స్వీకరించిన కొంత కాలానికి తన ఫిట్ నెస్ ఛాలెంజ్ వీడియోను ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. ప్రధాని తాను నిత్యం చేసే పంచతత్త్వాల వ్యాయామాలనే అచరిస్తూ తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ మేరకు తన ట్వీట్ లో ప్రధాని.. యోగాలో భాగమైన పంచతత్వాలు.. భూమి, నీరు, అగ్ని, వాయు, అకాశాలతో కూడిన వ్యాయామాలు అచరించడం వల్ల తనకు ఎంతో మానసిక ఉల్లాసం, ప్రేరణ కలుగుతుందని చెప్పారు. దీంతో పాటు తాను శ్వాససంబంధ వ్యాయామాలు కూడా అచరిస్తానని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ అనే క్యాప్షన్ పెట్టి మారీ హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు. విరాట్‌ కోహ్లీ చేసిన ఫిట్ నెస్ సవాలును స్వీకరించిన ప్రధాని తాజాగా ఈ సవాలును కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి సవాల్ విసిరారు. అయనతో పాటు కామన్వెల్త్ క్రీడల పతక విజేత మోనికా బాత్రా, 40 ఏళ్ల వయసు దాటిన ఐఎఎస్ అధికారులనూ చాలెంజ్ చేశారు. కాగా, ఈ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను మొదలు పెట్టింది మాత్రం కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్. ఆయన ఈ చాలెంజ్ కు తెరతీసి.. విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులకు ఛాలెంజ్ చేశారు. మోదీ వీడియోను మీరూ చూడవచ్చు.

అయితే ఒక జట్టు కెప్టెన్ విసిరిన సవాలను స్వీకరించిన ప్రధాని మోదీ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ సహా పలువరు విసిరిన సవాళ్లను మాత్రం స్వీకరించలేదు. దేశ ప్రధానిగా తాను ఫిట్ గా వుండటం మంచిదే కానీ.. దేశ ప్రజలు కూడా ఫిట్ గా వుండేలా చర్యలు తీసుకోవాలని, మరీ ముఖ్యంగా రైతాంగం అదోగతి పాలవుతున్న క్రమంలో వారిని సంక్షేమం ఫిట్ గా వుండేలా చర్యలు తీసుకోవాలని, యువతకు ఉపాధినిస్తే వారు ఫిట్ అవుతారని.. ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పాలనాపరంగా కూడా ఫిట్ గా వుండేలా.. చర్యలు తీసుకోవాలని ఎద్దేవా చేస్తున్నారు. మరి ప్రతిపక్ష నేతల సవాళ్లను ప్రధాని ఎప్పుడు స్వీకరించి.. ఎప్పుడు వాటిని అచరించి వీడియో అప్ లోడ్ చేస్తారో వేచిచూడాల్సిందే.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, తనను టార్గెట్ చేస్తూ ఫిట్ నెస్ చాలెంజ్ చేయడంపై కర్ణాటక సీఎం కుమారస్వామి వెంటనే స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. "ప్రియమైన నరేంద్రమోదీ... నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు. శారీరక ఫిట్ నెస్ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. ఫిట్ నెస్ చాలెంజ్ కి నేను మద్దతిస్తున్నాను. యోగా, ట్రెడ్ మిల్ నా దైనందిన జీవితంలో భాగమే. నా రాష్ట్ర ప్రజల ఫిట్ నెస్ ను మరింతగా పెంచేందుకు మీ సహకారం కావాలి" అని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles