set back to vivek in high court తెలంగాణ ప్రభుత్వ సలహాదారుకు ఎదురుదెబ్బ..

Set back to former mp vivek in high court

vivek disqualifies as hca president, Hyderabad Cricket Association (HCA), High Court of Hyderabad, HCA Vivek, hca president vivek, G Vivek, Telangana, politics

Its a set back to telangana government advisor and HCA President former parliamentarian G Vivek as high court upholds abdudsmen judgement and strikes off single judge judement

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుకు ఎదురుదెబ్బ..

Posted: 06/12/2018 02:57 PM IST
Set back to former mp vivek in high court

కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వ రద్దు అంశంలో ఇటీవలే తెలంగాణ అధికార పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు కాగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారు హోదాలో కేబినెట్ స్థాయి ర్యాంకులో కొనసాగుతున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ కూడా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్ష హోదాలో ఆయన కొనసాగింపు చెల్లదని రాష్ట్రోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది.

గతంలో అంబుడ్స్‌మన్‌ ఇచ్చిన తీర్పును సమర్థించిన హైకోర్టు.. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును నిలిపేస్తూ మంగళవారం (జూన్ 12) ఉత్తర్వులు జారీ చేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి జి. వివేక్‌ అనర్హుడని ప్రకటిస్తూ అంబుడ్స్‌మన్‌ జస్టిస్‌ ఎల్‌. నర్సింహారెడ్డి మార్చిలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసును మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. అప్పటి వరకు హెచ్‌సీఏ అధ్యక్ష పదవిలో వివేక్ కొనసాగొద్దని స్పష్టం చేసింది.

వివేక్ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. కేబినేట్‌ స్థాయి పదవి అయిన సలహాదారు బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు హెచ్‌సీఏకు అధ్యక్షునిగా ఉండటం తగదని అంబుడ్స్‌మన్ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వివేక్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ అప్పట్లో స్టే విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vivek  disqualify  president  Hyderabad Cricket Association (HCA)  High Court  G Vivek  Telangana  politics  

Other Articles