'Rename Taj Mahal as Ram or Krishna Mahal': BJP MLA తాజ్ పేరును రాం మహల్ గా మార్చాలి: బీజేపి ఎమ్మెల్యే

Rename taj mahal on ram victoria memorial on janaki bjp mla

Taj mahal, Victoria Memorial, BJP, Surendra Singh, Taj Mahal controvery, Taj Mahal rename, Ram Mahal, Dalit girl, Unnao rape, kuldeep singh sengar, janaki mahal,

Controversial BJP MLA Surendra Singh, who had backed jailed MLA Kuldeep Singh Sengar, an accused of raping a Dalit girl in Unnao, stoked a fresh controversy with his demand to rename Agra-based white mausoleum Taj Mahal as ‘Ram Mahal or Krishna Mahal’.

తాజ్ పేరును రాం మహల్ గా మార్చాలి: బీజేపి ఎమ్మెల్యే

Posted: 06/11/2018 05:46 PM IST
Rename taj mahal on ram victoria memorial on janaki bjp mla

వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో వుండాలని కొందరు రాజకీయ నాయకులు అప్రస్తుతమైన విషయాలను కూడా హాట్ టాపిక్ గా మార్చేస్తారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే  ఉత్తర్ ప్రదేశ్ బీజేపి ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌. ఉన్నావ్ అత్యాచార కేసులో దళిత బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెనగర్ ను మద్దతుగా వ్యాఖ్యలు చేసి.. అసలు రోడ్లపై అమ్మాయిలకు ఏం పని అంటూ.. మహిళా లోకం అగ్రహాన్ని చవిచూసిన ఈ బైరా ఎమ్మెల్యే.. తాజాగా చారిత్రక కట్టడాల పేర్లపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని అగ్రాలో ప్రపంచ వింతగా గుర్తించబడిని తాజ్ మహల్ పై ఆయన చేసిన వ్యాఖ్యాలు దుమారం రేపుతోంది. ‘మొఘలుల పాలనా కాలం ముగిసిపోయిన తర్వాత వారి పేర్ల మీద ఉన్న రోడ్ల పేర్లు, చారిత్రక కట్టడాల పేర్లను ఎందుకు కోనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక ఆ పేర్లను యధావిధంగా కొనసాగించడం మానేసి.. వాటికి పేర్లను మార్చాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా తాజ్‌ మహల్‌ పేరును రామ్‌ మహల్, లేదా కృష్ణ మహల్ లేదా శివాజీ మహల్ గా నామకరణం చేయాలి’ అంటూ సురేంద్ర సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇక పనిలో పనిగా విక్టోరియా మోమొరియల్ పేరును కూడా జానకీ మహల్ అని మార్చాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొఘలులు నిర్మించిన కట్టడాలను కూల్చడానికి వీలులేదన్నారు. ఎందుకంటే అవి భారత గడ్డపై నిర్మించినవి. దీనికి బదులుగా వాటి పేర్లు మార్చాలి. నాకు వీటి పేర్లు మార్చే అవకాశం ఇస్తే తాజ్ మహల్ కు ‘రాష్ట్ర భక్తి మహల్‌’ అని నామకరణం చేస్తాను అని అన్నారు. ఇక మొఘలులు కట్టిన ఏదైనా ఒక కట్టడానికి డా. ఏపీజే అబ్దుల్‌ కలాం పేరు పెట్టి చూడండి. ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taj mahal  Victoria Memorial  BJP  Surendra Singh  Taj Mahal controvery  uttar pradesh  

Other Articles