'Daati Maharaj' booked on rape charges భక్తురాలిపై అత్యాచారం: ధాతి బాబాపై రేప్ కేసు

Female follower accused daati maharaj for the sexual harassment

Advaita, Inchegeri Sampradaya, Hindu saints, rape case on daati maharaj, Delhi, daati maharaj, baba raped woman disciple, baba in rape case, District Investigation Unit, Shani Dham, Daati Maharaj, rape, self-styled godman, national capital, Sexual assault, CRIME

A case has been registered against self-styled godman Daati Maharaj for allegedly raping a disciple. According to police sources, the case was registered in Fatehpur Beri.

భక్తురాలిపై అత్యాచారం: ధాతి బాబాపై రేప్ కేసు

Posted: 06/11/2018 05:08 PM IST
Female follower accused daati maharaj for the sexual harassment

తమకు తాముగా దైవాంశ సంభూతులమని, తమ భక్తుల కోసమే తాము ఈ మానుష అవతారంలో ఇలపైకి వచ్చామని చెప్పుకునే బాబాల సంఖ్య రానురాను మరింత పెరుగుతూపోతుంది. ఈ క్రమంలో కామికాని వాడు మోక్షగామి కాలేడనో ఏమో కానీ కొందరు స్వాములందరూ తమకు సేవ చేసే మహిళా భక్తురాళ్లపై లైంగికదాడులకు పాల్పడటంతో వారిపై కేసులు నమోదు కాగా, కొందరు విచారణను ఎదుర్కొంటుండగా, మరికొందరు మాత్రం బెయిల్ పై బయట వున్నారు. సచ్ఛా సౌదా డేరా బాబా, ఆశారాం బాపూ తదితర బాబాలు ఇప్పటికే ఈ కేసులలో అడ్డంగా బుకై కారాగారవాసం అనుభవిస్తున్నారు.

అయితే తన సహచర బాబాలకు పట్టిన గతి గురించి తెలుసుకుని.. బుద్దిగా నడుచుకోవాల్సిన బాబాలు.. తమకు ఈ విషయంలో భయం లేదని అనుకుంటున్నారో లేక మరేధీమాను కనబరుస్తున్నారో కానీ అలాంటి చర్యలకే పాల్పడుతూ అడ్డంగా బుకైవుతున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో మరో బాబా బండారం బట్టబయలైంది. రాజధాని ప్రాంతభక్తులను మాయమాటల్లో ముంచుతూ అక్కడే తిష్టవేసిన దాతి మహరాజ్ తన వద్దకు వచ్చిన ఓ మహిళా భక్తురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జరిగి రెండేళ్లు అయ్యింది.

అయితే బాబా చేతితో మోసపోయిన విషయాన్ని చెప్పడానికి ధైర్యం చాలని బాబా ఓ శిష్యురాలు.. బాబా తనను బెదిరించడం, ప్రజల్లో అతడికి ఉన్న పేరు ప్రఖ్యాతులను దృష్టిలో ఉంచుకొని ఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడానికి వెనుకాడానని ఆమె తెలిపారు. అంతేకాకుండా బాబాపై ఫిర్యాదు చేస్తే తన పేరు బయటకొస్తుందని, పరువు పోతుందని కూడా ఆలోచించానని ఆమె చెప్పారు. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని అమె బాబాపై పోలీసులకు పిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు బాబాపై భారత శిక్షాస్మృతి 376 కింద, 377, 354, 34 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసును మొదట ఫతేఫూర్ బెరిలో రిజిస్టర్ చేసిన పోలీసులు అనంతరం దానిని జిల్లా దర్యాప్తు విభాగానికి బదిలీచేశారు. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో విశేష గుర్తింపు సాధించిన దాతి మహరాజ్‌కు లక్షలాది మంది భక్తులుగా ఉన్నారు. ఢిల్లీలో ఆయన నెలకొల్పిన శనిధామ్ ఆశ్రమంలో ప్రతి గురువారం, శనివారం నిర్వహించే ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడానికి భక్తజనం వేలాదిగా హాజరవుతారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh