Corruption made us defeat says hardoi bjp mla అవినీతి వల్లే ఓడిపోయాం: యోగీ సర్కార్ కు ఎమ్మెల్యే జలక్

After bypoll loss reality check for bjp from its own mla in up

Noorpur, Kairana, Gorakhpur, tabassum hasan, Hardoi, Shyam Prakash, Yogi Adityanath, Bharatiya Janata Party, BJP, bypolls, Uttar Pradesh, Narendra Modi, Uttar Pradesh, politics

Uttar pradesh BJP MLA Shyam Prakash from Gopamau in Hardoi recalled the string of bypoll losses suffered by the BJP in UP this year, through a satirical poem in Hindi,

అవినీతి వల్లే ఓడిపోయాం: యోగీ సర్కార్ కు ఎమ్మెల్యే జలక్

Posted: 06/01/2018 04:58 PM IST
After bypoll loss reality check for bjp from its own mla in up

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడైనా అవినీతి కనిపించిందా.? అవినీతి లేని పాలనను తమ పార్టీ దేశ ప్రజలకు అందిస్తుందని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా ప్రకటిస్తూ వెళ్తుంటే.. సొంతపార్టీకి చెందిన ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే షాక్ ఇచ్చాడు. ప్రధానమంత్రికే కాదు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చారు. తమ ప్రభుత్వం హాయంలో పెరిగిన అవినీతే తమను ప్రజలకు దూరం చేసిందని, ఉప ఎన్నికలలో ఓటమికి కూడా కారణం అదేనని ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు బీజేపితో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

అవినీతి పెరిగిందని ఎవరైనా విపక్షాల సభ్యులు వ్యాఖలు చేసివుంటే.. ఈ పాటికీ వారిని అనేక రకాలుగా విమర్శించే బీజేపి నేతలు సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన అరోఫణలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది. 'అవినీతి' కారణంగానే కైరానా, నూర్‌పూర్‌ ఉపఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందంటూ హార్దోయ్‌ ఎమ్మెల్యే శ్యాంప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారు. రైతులు ప్రభుత్వంపై వ‍్యతిరేకత కలిగి ఉన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు అవితీని పెరిగింది. ఇలాంటి బొలెడన్ని కారణాల వల్లే మేం ఓడిపోయాం' అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతటితో ఆగకుండా ఆరెస్సెస్ చేతిలో ప్రభుత్వ పగ్గాలున్నాయనీ, ముఖ్యమంత్రి కూడా నిస్సహాయుడిలా మారారని అర్ధం వచ్చేలా తన ఫేస్‌బుక్‌ పేజీలో ఒక పద్యం కూడా పోస్ట్‌ చేశారు. మోడీ పేరుతో పార్టీ అధికారంలోకి వచ్చినట్టు ప్రభుత్వం చెబుతోందనీ... కానీ ప్రజల అంచనాలకు తగ్గట్టు పనిచేసి వారి హృదయాలను గెలుచుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆ ఎమ్మెల్యే విమర్శించారు.  మోడీ హవా కారణంగానే అధికారం దక్కించుకోగలిగినా ప్రజల మనసుల్ని మాత్రం గెలవలేకపోయారని వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharatiya Janata Party  BJP  bypolls  Uttar Pradesh  Narendra Modi  Uttar Pradesh  politics  

Other Articles