sushma apoligies for mistake అది ముమ్మాటికీ నేను చేసిన తప్పే.. క్షమించండీ

Sushma swaraj apologises for saying pm modi addressed indians in nepal

Sushma Swaraj, Narendra Modi, Modi in Nepal, PM Modi in Nepal, Gagan Thapa, Janakpur Nepal, Janakpur trip, sushma swaraj, pm modi, nepal tour, nepalis, indians, nepal sovereignty, apology, politics

Sushma Swaraj tweeted an apology after Twitter users, including Gagan Thapa, a Nepal parliamentarian, pointed out that PM Narendra Modi addressed Nepali people in Janakpur and not Indians.

అది ముమ్మాటికీ నేను చేసిన తప్పే.. క్షమించండీ

Posted: 05/29/2018 01:15 PM IST
Sushma swaraj apologises for saying pm modi addressed indians in nepal

ప్రధాని నరేంద్రమోడీ, బీజేపి పార్టీ తన ప్రచార జిమ్మిక్కులు ఎలా వుంటాయన్నది ఇటీవలి కాలంలో బయటపడిన విషయం తెలిసిందే. అయనతో పాటు దేశంలోని అనేక మంది నాయకులు ఈ విధానాన్నే అమలు చేస్తున్నారని కూడా తేలింది. అయితే తమకున్న ప్రజాదరణ కొంత అయితే దానిని చంతాడంత చూపే మార్గాలను మరీ ముఖ్యంగా ప్రభుత్వవర్గాలు అందిపుచ్చుకోవడం.. తద్వారా వారు అందుకోసం వక్రమార్గాలను కూడా అన్వేషించాల్సి వస్తుందన్న నేపథ్యంలో ఇది ఆ మధ్యకాలంలో తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారింది.

ఇక తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా అలాంటి తప్పే చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నాలుగేళ్ల కాలం పూరైన సందర్భంగా అమె ఈ తప్పును చేశారు. అయితే అమె తప్పును నేపాల్ కు చెందిన పార్లమెంటు సభ్యుడు తప్పుగా అభివర్ణిస్తూ ట్వీట్ చేయడంతో నాలుక కరుచుకున్న సుష్మాస్వరాజ్.. తాను చేసింది తప్పే అంటూ అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే అమె తప్ప చేయదని గంటాపథంగా విశ్వసిస్తున్న నెట్ జనులు.. అమెతో కూడా ప్రధాని తప్పుచేయించారని భావన కలిగేలా కామెంట్లు పెడుతున్నారు.

అసలేం జరిగిందీ అన్న వివరాల్లోకి వెళ్తే.. దాదాపు 20 రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడీ నేపాళ్ పర్యటనకు వెళ్లినప్పుడు.. అక్కడున్న లక్షలాదిమంది భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారంటూ ఆమె తన ట్విట్టర్ లో పేర్కొనడంపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. జనక్‌ పూర్‌ లో మోదీ నేపాలీలతో మాట్లాడారే తప్ప, భారతీయులతో కాదని నేపాల్‌ రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలకు దిగారు. భారత్ తమ దేశ సార్వబౌమత్వాన్ని విఘాతం కలిగించే చర్యలకు పూనుకోవడం సమంజసం కాదని పేర్కోన్నారు.

దీంతో, సోమవారం రాత్రి మరోసారి సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. "ఈ పొరపాటు నా వల్లే జరిగింది. అందుకు నేను మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నాను" అని ఆమె అన్నారు. నాడు మోదీ గురించి తాను మాట్లాడిన అంశంపై ఓ చిన్న వీడియోను సైతం ఆమె పోస్టు చేశారు.  అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ నుంచి మొదలు పెట్టి, నేపాల్‌ లోని జనక్‌ పూర్ వరకూ, లక్షలాది మంది భారతీయులను కలుసుకుని మాట్లాడిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు తమ దేశ సార్వభౌమత్వాన్ని చాలా సాధారణంగా తీసిపారేస్తున్నట్టు ఉన్నాయని ఆ దేశ నేతల నుంచి విమర్శలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushma swaraj  pm modi  nepal tour  nepalis  indians  nepal sovereignty  apology  politics  

Other Articles