Elephant Tramples Mahout to Death ఆలయంలో ఏనుగు భీభత్సం.. మావటి మృత్యువాత

Temple elephant in tamil nadu tramples mahout to death

mahout death , Samayapuram Temple , Tiruchy elephant, samayapuram mariamman temple, Elephant, Crushes, Mahout, Death, Temple, Tamil Nadu, Mahout Trampled, Mahout crushed, Trichy

In a shocking incident in the temple suburb of Samayapuram in Trichy district, an elephant trampled her mahout to death on Friday.

ITEMVIDEOS: ఆలయంలో ఏనుగు భీభత్సం.. మావటి మృత్యువాత

Posted: 05/25/2018 07:11 PM IST
Temple elephant in tamil nadu tramples mahout to death

తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చిలోని మరియమ్మన్ ఆలయంలో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. ఆలయంలోని భక్తులను బెంబేలెత్తించింది. అడ్డకోబోయిన మావటిని కూడా తొక్కి చంపేసింది. తిరుచ్చిలోని మరియమ్మన్ ఆలయానికి ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు అధికసంఖ్యలో వచ్చి అక్కడ నిర్వహించే ప్రత్యేక పూజల్లో పాల్గోంటారు. దీంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఇవాళ కూడా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఇక్కడి దేవాలయ ఆచారాల్లో భాగంగా.. గుడికి ఏనుగును తీసుకువస్తారు. ఇలా తీసుకువచ్చిన ఏనుగును కూడా దైవంగా భావించే భక్తులు.. దానికి కూడా నమస్కరిస్తుంటారు. సరిగ్గా ప్రసాదాలు ఇస్తున్న సమయంలో.. ఏనుగు ఒక్కసారిగా అరుస్తూ అందరినీ హడలెత్తించింది. భక్తులంతా పరుగులు పెట్టారు. ఏనుగుపై ఉన్న మావటి గజేంద్రన్.. అదుపు తప్పి.. కిందపడిపోయాడు. కోపంతో ఉన్న ఏనుగు.. మావటిని తొక్కి చంపేసింది. ఆలయ సిబ్బంది.. పోలీసులు, ఏనుగును కట్టేసి నియంత్రించారు. ఈ ఘటనలో 8మంది భక్తులకు గాయాలయ్యాయి.

రోజూ ఏనుగు సంరక్షణ చూసే మావటి.. అదే ఏనుగు దాడిలో చనిపోవటం భక్తులను కలిచివేసింది. కొన్నేళ్లుగా ఆ ఏనుగు ఆయన సంరక్షణలో ఉంది. కింద పడిన వెంటనే.. అతడిని తన కాళ్లతో తొక్కింది.. తొండంతో విసిరేసింది.. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. కంట్రోల్ చేసే మావటి పరిస్థితి అలా ఉంటే.. మిగతా వారు వణికిపోయారు. అతన్ని రక్షించటానికి.. ఏనుగును కంట్రోల్ చేయటానికి సాహసించలేకపోయారు. దీంతో ఆయన గుడిలోనే చనిపోయాడు. ఆ తర్వాత కొందరు సిబ్బంది, అటవీశాఖ అధికారులు వచ్చి.. ఏనుగును అక్కడి నుంచి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Elephant  Crushes  Mahout  Death  Temple  Tamil Nadu  Mahout Trampled  Mahout crushed  Trichy  

Other Articles