congress lodges compliant against bjp leaders ఎమ్మెల్యేలకు ప్రలోభాలపై బీజేపి నేతలపై ఫిర్యాదులు

Kpcc lodges complaint with acb over alleged bribe offer by bjp

bribe case, bjp leaders, lawyer Surya Mukundaraj, anti corruption bureau, kpcc lawyer, B.S. Yeddyurappa, BJP, Congress, JD(S), karnataka assembly, assembly speaker, speaker election, congress mlas, jds mlas, Siddaramaiah, Congress, BJP, JDS, Kumara Swamy, karnataka, politics

Karnataka Congress lawyer Surya Mukundaraj sought registration of a complaint against BJP's BS Yeddyurappa and five others alleging criminal conspiracy to win the floor test in Karnataka Assembly.

కమలపార్టీ నేతలకు చుక్కలు.. ఎమ్మెల్యేలకు ప్రలోభాలపై ఫిర్యాదులు

Posted: 05/25/2018 11:31 AM IST
Kpcc lodges complaint with acb over alleged bribe offer by bjp

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కన్నడ ఓటరు ఇచ్చిన తీర్పుతో నేపథ్యంలో రోజురోజుకు రాజకీయాలు శరవేగంగా మారి.. ఇక తాజాగా కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నేతృత్వంలో కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడింది. రెండు రోజుల క్రితం అట్టహాసంగా కుమారస్వామి.. దేశానికి చెందిన పలువురు బీజేపీయేతర ప్రముఖ నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ దశలో ఇవాళ స్పీకర్ పదవికి ఎన్నిక పై కూడా తమకు పూర్తి బలం వుందని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే అంతకుముందు యడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవిని నిలుపుకునేందుకు తమ ఎమ్మెల్యేలకు వంద నుంచి రెండొందల కోట్ల రూపాయల వరకు ఇస్తామని, మంత్రి పదవులకు కూడా ఇస్తామని ప్రలోభాలకు గురిచేసిన క్రమంలో బీజేపీకి అధికారం దక్కకుండా చివరి వరకు ప్రయత్నించి కాంగ్రెస్-జేడిఎస్ సఫలమైంది. దీంతో ఇప్పుడు మాజీ సీఎం యడ్యూరప్పతో పాటు పలువురు బీజేపీ నేతలపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)కి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ న్యాయవాది ఒకరు బెంగళూరు అర్బన్ వింగ్, యాంటీ కరెప్షన్ బ్యూరో ఎస్పీకి లేఖ రాశారు.

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గేందుకు కుట్రలకు పాల్పడ్డారని అందులో ఆరోపించారు. ఫ్లోర్ టెస్ట్‌లో ఎలాగైనా నెగ్గేందుకు నేరపూరిత కుట్ర, అవినీతికి పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు కోట్లాది రూపాయలు ఇస్తామని ఆశ చూపారని, మంత్రి పదవులు కూడా ఇస్తామని ప్రలోభపెట్టారని లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో గతంలో యడ్యూరప్ప, అతని కుమారుడు, శ్రీరాములు, మురళీదర్ రావులు తమ ఎమ్మెల్యేలు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడిన అడియో టేపులను కూడా సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles